Begin typing your search above and press return to search.

టార్గెట్ కేసీఆర్‌.. రేవంత్ స‌క్సెస్ రేటెంత‌?!

ఈ క్ర‌మంలో కేసులు, శిక్ష‌లు.. అని కూర్చుంటే ప్ర‌మాద‌మ‌ని అనుకున్నారో.. ఏమో తెలియ‌దు కానీ.. ఇప్పు డు భారీ ప్ర‌ణాళిక‌తోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 4:00 PM IST
టార్గెట్ కేసీఆర్‌.. రేవంత్ స‌క్సెస్ రేటెంత‌?!
X

రాజ‌కీయాల్లో ప్ర‌త్యర్థుల‌ను టార్గెట్ చేయడం అనేది అవ‌స‌రం. అస‌లు ప్ర‌త్య‌ర్థుల ఊసు లేకుండా రాజ‌కీయాలే లేవు క‌దా! తెలంగాణ‌లోనూ అదే జ‌రుగుతోంది. త‌న ప్ర‌త్య‌ర్థిని టార్గెట్ చేయ‌క‌పోతే.. త‌న‌కు ఇబ్బం ది అని భావించిన సీఎం రేవంత్ రెడ్డి .. మాజీ సీఎం కేసీఆర్ కేంద్రంగా అడుగులు వేస్తున్నారు. త్వ‌ర‌లోనే గ్రామ స్థాయి ఎన్నిక‌ల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ద‌రిమిలా.. కేసీఆర్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఈ ఎన్నిక‌ల‌ను త‌న‌వైపు అనుకూలంగా తిప్పుకోవాల‌న్న‌ది రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌.

ఈ క్ర‌మంలో కేసులు, శిక్ష‌లు.. అని కూర్చుంటే ప్ర‌మాద‌మ‌ని అనుకున్నారో.. ఏమో తెలియ‌దు కానీ.. ఇప్పు డు భారీ ప్ర‌ణాళిక‌తోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌నే స్వ‌యంగా బ‌రిలోకి దిగుతున్న ట్టు సంకేతాలు ఇచ్చారు. దీనిలో ప్ర‌ధానంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తోపాటు.. బీఆర్ ఎస్ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాలు, అన్యాయాల‌ను కూడా.. వెలికి తీస్తామ‌ని చెబుతున్నారు. నిజానికి తీయా ల్సిన‌వి ఇప్ప‌టికే తీశారు. అయినా.. మిగిలి ఉన్నాయ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు.

వీటితోపాటు.. రైతుభ‌రోసా, ఇందిర‌మ్మ ఇళ్లు.. వంటివాటినిఆయ‌న తెర‌మీదికి తెచ్చారు. గ్రామ స్థాయిలో రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసేలా ఇవి మార‌నున్నాయ‌న్న సంకేతాల నేప‌థ్యంలో సీఎం.. ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వాస్త‌వానికి పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగినా.. అక్క‌డ రాజ‌కీయంగా నాయ‌కు లు పోటీచేయ‌రు. ఫ‌లానా పార్టీ త‌ర‌ఫున అని నేరుగా ప్ర‌చారం ఉండ‌దు. కానీ, అనుకూల నాయ‌కులు ఉంటారు. ఈ అనుకూల ప‌రిస్థితిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చాల‌న్న‌దే రేవంత్ వ్యూహం.

ప్ర‌స్తుతం బీఆర్ఎస్‌లో అనైక్య‌త నెల‌కొన్న ద‌రిమిలా.. కీల‌క నాయ‌కులు ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా ఉన్నా రు. వాస్త‌వానికి ఇప్ప‌టికే ప్ర‌చారం చేప‌ట్టాల‌ని కేసీఆర్ అనుకున్నా..కుమార్తె విష‌యంపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ప్ర‌స్తుతం చ‌డీ చ‌ప్పుడు లేక‌పోయినా.. పార్టీ నెంబ‌ర్ 2గా ఎద‌గాల‌ని క‌విత భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆమె ఉత్త‌రాల ఉద్య‌మానికి పిలుపునిచ్చారు. ఇక‌, కేటీఆర్ దాదాపు సైలెంట్ అయ్యారు. స‌రిగ్గా ఇదేస‌మ‌యం త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని అనుకుంటున్న రేవంత్.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా గ్రామ స్థాయికి త‌న స‌ర్కారు మేళ్ల‌ను తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఆయ‌న ఏమేర‌కు స‌క్సెస్ అవుతార‌న్న‌ది చూడాలి.