Begin typing your search above and press return to search.

రేవంత్ చెప్పిన 'సిక్స్ ప్యాక్' ఫార్ములా

తాజాగా రైతు సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, యువతలో ఆరోగ్యంపై మారుతున్న దృక్కోణంపై అభిప్రాయం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   17 Jun 2025 6:50 AM
రేవంత్ చెప్పిన సిక్స్ ప్యాక్ ఫార్ములా
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకమైన మాటలతో యువతను ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో "రాగ్స్ టు రిచెస్" కథను రాసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు యువతకు ఆరోగ్య సూత్రాన్ని చెప్పారు. అదీ మోడర్న్ జిమ్స్, ఫారిన్ డైట్ ఫుడ్ లాంటివి లేకుండా సంప్రదాయ సిక్స్ ప్యాక్ ఎలా తెచ్చుకోవాలో సీఎం సూచించారు. అదే వైరల్ అయ్యింది.

తాజాగా రైతు సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, యువతలో ఆరోగ్యంపై మారుతున్న దృక్కోణంపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు జనాలు ఆరోగ్యంగా ఉండేందుకు విదేశీ ఆహార పదార్థాలు, ముక్కు సూటి ఆకులు వంటివి తింటున్నారు. కానీ ఆరోగ్యానికి నిజమైన మార్గం మన పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయ ఆహారమే’’ అన్నారు.

‘‘మన తెలంగాణ పూర్వీకులు ఇచ్చిన జొన్న రొట్టెలు తినండి. రోజూ స్వయంగా పనులు చేసుకోండి. బట్టలు ఉతుక్కోండి. అంతే, వర్కౌట్స్ అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండొచ్చు, సిక్స్‌ప్యాక్ రావచ్చు కూడా. ఇదే నిజమైన పద్ధతి. శరీరం పండుతుందంటే లేబర్ చేయాలి. మన పనులు మనమే చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

అంతేకాకుండా గత తరం ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండే వారని, ఎందుకంటే వాళ్ళు శుద్ధమైన ఆహారం తీసుకునేవారని చెప్పారు. ఆత్మనిర్భరత, శారీరక శ్రమతో కూడిన జీవనశైలి వాళ్ళు అనుసరించేవారని చెప్పారు. ఈ తరం యువత కూడా అదే దారిలో సాగాలని సూచించారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి చెప్పిన ఈ సిక్స్‌ప్యాక్ మంత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం అంటే జిమ్‌కెళ్లడం, ఫారెన్ సప్లిమెంట్స్ తినడం అనుకునే యువతకు ఇది మంచి అవగాహన కలిగించే సందేశంగా నిలుస్తోంది.