Begin typing your search above and press return to search.

పంతం నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి

ఈ ఇద్దరూ కలసి మెలసి పనిచేసేవారు. ఈ ఇద్దరూ టీడీపీలో జంటగానే ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ కి వచ్చిన తరువాత ఆయనతో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా వచ్చేశారు.

By:  Satya P   |   5 March 2026 9:00 AM IST
పంతం నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అనుకున్న వారికి సన్నిహితులకు ఎంత అండగా ఉంటారు అన్నది రుజువు అయింది. వైఎస్సార్ మాదిరిగానే ఆయన కూడా తన వారి కోసం పట్టుబట్టి నెగ్గించుకున్నారు అని అంటున్నారు. తెలంగాణాలో రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు సీట్లకు విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఇందులో ఒక సీటు అన్నది ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది.

ఆయనకు మరోసారి :

తాజాగా రిటైర్ అవుతున్న అభిషేక్ మను సింఘ్వికి మరో సారి రాజ్యసభ సీటుని రెన్యూల్ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి అత్యంత సన్నిహితులు కావడంతో మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఉన్నది ఒక్క సీటు. దాని కోసమే వీ హనుమంతరావు లాంటి వారి నుంచి అనేక మంది పోటీ పడ్డారు. అలా రేసులో సీనియర్లు జూనియర్లు ఎక్కువ మంది ఉన్నా కూడా ఇంతటి పోటీలో రేవంత్ రెడ్డి తన మనిషిని తన సన్నిహితుడికి అవకాశం ఇప్పించుకున్నారు అని అంటున్నారు.

ఆయనకు గోల్డెన్ చాన్స్ :

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డికి మంచి దోస్తీ ఉంది. ఈ ఇద్దరూ కలసి మెలసి పనిచేసేవారు. ఈ ఇద్దరూ టీడీపీలో జంటగానే ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ కి వచ్చిన తరువాత ఆయనతో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా వచ్చేశారు. అలా మంచి స్నేహ బంధాన్ని ఇద్దరూ చాటుకున్నారు. దనతో కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి తాను సీఎం అయిన తరువాత వచ్చిన తొలి రాజ్యసభ ఎన్నికల్లో తన స్నేహితుడికి చాన్స్ ఇప్పించారు అని అంటున్నారు. దాంతో నరేందర్ రెడ్డికి ఇది ఒక గోల్డెన్ చాన్స్ అని అంటున్నారు. ఆరేళ్ల పాటు పెద్దల సభలో అవకాశం అంటే ఆయనకు రాజకీయంగా కేలకమైనదే అని అంటున్నారు.

నామినేషన్ దాఖలు :

ఇక వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు, సీనియర్ నాయకుడు. వేం నరేందర్ రెడ్డి 2004లో మహబూబాబాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు అయితే 2009 ఎన్నికలో ఓటమి పాలు ఆయ్యారు. టీడీపీలో ఉండగానే ఆయనకు రేవంత్ రెడ్డికి మంచి స్నేహం ఏర్పడింది. దాంతో ఆయనతో పాటే కాంగ్రెస్ లో చేరారు. అక్కడ పార్టీ పరంగా పదవులు నిర్వహించారు. ఇక 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమించింది. ఇపుడు ఏకంగా రాజ్యసభలోనే అడుగుపెడుతున్నారు. అభిషేక్ మను సింఘ్వీ నరేందర్ రెడ్డి గురువారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు అని అంటున్నారు.