Begin typing your search above and press return to search.

రాహుల్ తో భారీ ప్రోగ్రాం కి రెడీ అయిన రేవంత్

అదే విధంగా ఆయన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. తెలంగాణాలో ముగ్గురు మంత్రులను కొత్తగా తీసుకున్న తరువాత ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని కలవడం ఇదే ప్రధమం.

By:  Tupaki Desk   |   7 July 2025 10:30 AM IST
రాహుల్ తో భారీ ప్రోగ్రాం కి రెడీ అయిన రేవంత్
X

పెద్ద పని మీదనే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన ఢిల్లీలో రెండు రోజుల పాటు గడపనున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులను కలుస్తారు. అలా అధికారిక కార్యక్రమంగా కూడా ఉంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలసి తెలంగాణా సమస్యలను ఆయనకు వివరిస్తారు అని అంటున్నారు.

అదే విధంగా ఆయన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. తెలంగాణాలో ముగ్గురు మంత్రులను కొత్తగా తీసుకున్న తరువాత ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని కలవడం ఇదే ప్రధమం. అంతే కాదు రాహుల్ గాంధీతో తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను వర్తమాన రాజకీయాలను రేవంత్ రెడ్డి వివరిస్తారు అని అంటున్నారు.

ఆయనను తెలంగాణాకు రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారు అని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ప్రతీ సంక్షేమ కార్యక్రమానికి అవసరం అయిన కొలమానం రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అర్హతగా నిర్ణయించిన రేషన్ కార్డులు పేదలకు దక్కకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఏకంగా రెండున్నర లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు అని అంటున్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డుని ఇస్తామని అలాగే వాటి ద్వారా పధకాలను కూడా తప్పకుండా అమలు చేస్తామని పేర్కొంటున్నారు. దీనిని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

అందుకే పేదల పండుగగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని ముఖ్య అతిధిగా హాజరు అయ్యేలా చూడాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అని అంటున్నారు. రాహుల్ గాంధీ భేటీలో ఆయనకు తెలంగాణాకు రావాలని కోరుతారని అంటున్నారు. రాహుల్ గాంధీ ఒప్పుకుంటే కాంగ్రెస్ కి బూస్టింగ్ ఇచ్చేదిగా రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని అంటున్నారు.

ఒకవేళ రాహుల్ గాంధీ కనుక రాకపోతే కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీని అయినా తీసుకుని రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం రేషన్ కార్డుల పంపిణీని భారీ కార్యక్రమంగా చేయాలని తెలంగాణా కాంగ్రెస్ నాయకత్వం డిసైడ్ అయింది.

మరో వైపు చూస్తే ఏపీలో కూడా దాదాపుగా రెండు లక్షల దాకా రేషన్ కార్డుల పంపిణీకి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది అంటున్నారు. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. స్మార్ట్ కార్డులుగా వీటిని తెస్తున్నారు. ఈ రేషన్ కార్డుల మీద లబ్దిదారుని ఫోటో తప్ప ఎవరి ఫోటో ఉండదని అంటున్నారు. అలాగే ప్రభుత్వ చిహ్నం ఉంటుందని చెబుతున్నారు.