రేవంత్‌రెడ్డికి గవర్నర్ మద్దతు ఎంత?!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బందే వచ్చింది. ఒకవైపు కేంద్రంతో మహిళా బిల్లు విష యంపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలకనాయకుడిగా ఆయన ముద్రవేసుకున్నారు.
By: Garuda Media | 19 April 2026 8:00 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బందే వచ్చింది. ఒకవైపు కేంద్రంతో మహిళా బిల్లు విష యంపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలకనాయకుడిగా ఆయన ముద్రవేసుకున్నారు. నేరుగా పేరు చెప్పకపోయినా.. ప్రధాన మంత్రితన ప్రసంగంలో తమిళనాడు సహా.. తెలంగాణ పేరును ఒక చోట ఉదహరించారు. ఈ పరిణామాలు.. రేవంత్ రె్డ్డి ప్రభుత్వంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజాగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను.. రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. ఇద్దరు నాయకులను మండలికి సిఫారసు చేయాలని ఆయనను కోరారు. అయితే.. ఇది సాధ్యమవుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. గవర్నర్ కోటాలో సిఫార్సు చేయడం అనేది పూర్తిగా గవర్నర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సూచిస్తున్న ఇద్దరు నాయకులను ఆయన నామినేట్ చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎవరా ఇద్దరు..
గవర్నర్ కోటాలో శాసన మండలికి పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్న వారిలో ప్రొఫెసర్ కోదండరాం.. సహా.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అజారుద్దీన్ ఉన్నారు. వీరిలో అజారుద్దీన్ పరిస్థితి అత్యంత ముఖ్యంగా మారింది. ఆయన ఇప్పటికే ఆరు మాసాలుగా మంత్రిగా ఉన్నారు. కానీ, ఏ సభలోనూ ఆయన ప్రాతినిధ్యం లేదు. ఈ నెల 30 లోటా అంటే.. కేవలం 11 రోజుల్లోనే ఆయనను మండలికి సిఫార్సు చేయాల్సి ఉంది. అలా చేయకపోతే.. మంత్రిపదవిని సైతం ఆయన కోల్పోవడం ఖాయం.
ఇక, కోదండరాంను ఇప్పటికే గతంలో గవర్నర్ కోటా కింద సిఫార్సు చేసినా.. అది ఫలించలేదు. ఉద్యమ నాయకుడిగా పేరుతెచ్చుకున్న కోదండరాంను సభకు పంపించడం ద్వారా.. రాజకీయ మైలేజీ ఉంటుందని రేవంత్ ఆశలు పెట్టుకున్నారు.ఈ ఇద్దరిని గవర్నర్ కోటాలోనే మండలికి పంపించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో.. కేంద్రం చెప్పుచేతల్లోనే గవర్నర్‌లు పనిచేస్తున్న కారణంగా.. రేవంత్ ఆశలు ఫలిస్తాయా? అనేది ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి.
