గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... మళ్లీ అదే డిబేట్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సోమవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 12 May 2025 3:30 PMతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సోమవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో భేటీ అయ్యారు. ఆయనతోపాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా గవర్నర్‌ను కలిశారు. అయితే.. ఈ భేటీలో ఏం చర్చిం చారన్నది తెలియాల్సి ఉంది. కానీ, పార్టీ వర్గాల్లో మాత్రం మళ్లీ అదే చర్చ ప్రారంభమైంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయనున్నారని.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా గవర్నర్‌తో భేటీ అయ్యారని.. నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో మంత్రి వర్గవిస్తరణ గురించిన చర్చ జోరుగానే సాగుతోంది. అయితే.. ఇలా చర్చకు రావడం.. మళ్లీ ఆ చర్చ వెంటనే సర్దుమణిగిపోవడం తెలిసిందే. ఇటీవల ఏకంగా.. ఇంకేముంది జాబితా కూడా రెడీ అయిపోయిందన్న వాదన బలంగా వినిపించింది. నాయకులు కూడా తమకంటే తమకే పదవి దక్కడం ఖాయమని లెక్కలు వేసుకున్నారు. ఒకరిద్దరురోడ్డుపైకి వచ్చి కామెంట్లు కూడా కుమ్మరించారు. కానీ, ఎందుకో మరోసారి వాయిదా పడింది.
ఇక, ఇటీవల పాక్-భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి కబురు వచ్చింది. దీంతో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు సహా.. పార్టీ తెలంగాణ చీఫ్‌తో కలిసి సీఎం ఢిల్లీ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ, రెండు రోజుల్లోనే తాజాగా సోమవారం ఆయన గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇక, మంత్రివర్గ విస్తరణ ఖాయమైనట్టేనన్న చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది.
ఇదిలావుంటే.. ముఖ్యమం త్రి కార్యాలయ వర్గాలు మాత్రం.. దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చించేం దుకు సీఎం వెళ్లారని చెబుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిల బడేలా ప్రభుత్వం సర్వసన్నద్దమైందని.. ఈ విషయాలను గవర్నర్‌కు వివరించేందుకే రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. కానీ, పార్టీ నాయకులు మాత్రం అలాంటిదేమీ లేదని, కేవలం మంత్రివర్గవిస్తరణ కోసమే వెళ్లారని అంటున్నారు.