Begin typing your search above and press return to search.

స్టార్ క్యాంపెయిన‌ర్‌గా రేవంత్ రెడ్డి.. ఏ రాష్ట్రంలో ప్ర‌చార‌మంటే!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, ఫైర్ బ్రాండ్ పొలిటీషియ‌న్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కేర‌ళ అసెంబ్లీ ప్ర‌చారానికి నియ‌మించింది.

By:  Garuda Media   |   31 March 2026 10:00 PM IST
స్టార్ క్యాంపెయిన‌ర్‌గా రేవంత్ రెడ్డి.. ఏ రాష్ట్రంలో ప్ర‌చార‌మంటే!
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి, ఫైర్ బ్రాండ్ పొలిటీషియ‌న్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కేర‌ళ అసెంబ్లీ ప్ర‌చారానికి నియ‌మించింది. స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో ఆయ‌న పేరును కూడా పేర్కొం ది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌.. కాంగ్రెస్ పార్టీకి కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌చారాన్ని తీవ్ర‌త‌రం చేయ‌నుంది.

ముఖ్యంగా బ‌ల‌మైన గ‌ళం వినిపించే నాయ‌కుల‌ను స్టార్ క్యాంపెయినర్లుగా నియ‌మిస్తోంది. ఈ జాబితాలో రేవంత్ రెడ్డి స‌హా.. మ‌రో మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌ బాబు కూడా ఉన్నారు. బుధ‌వారం నుంచి దాదాపు 7 రోజులు వారు తెలుగు వారు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో పర్య‌టించి.. కాంగ్రెస్ కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌నున్నారు. ఒక‌వైపు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు ప్ర‌చారం చేస్తున్నా.. ప్రాంతాల వారీగా; భాష‌ల వారీగా కూడా.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు పొరుగు రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కుల‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు.

గ‌తంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు కూడా రేవంత్ రెడ్డి అక్క‌డ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చా రం చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌చారం చేసిన ప్రాంతాల్లో పార్టీకి మెజారిటీ పెరిగింది. ఒక ఎమ్మెల్యే కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌లోని ఎర్నాకులం, హోసూరు జిల్లాలు స‌హా.. తిరువ‌నంత‌పురంలోనూ రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేయ‌నున్నారు.

అలాగే.. ప‌థ‌నంతిట్టలోని రెండు నుంచి మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆయ‌న ప్ర‌చారం సాగ‌నుంది. కాగా.. మ‌రో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కూడా కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. వీరికి భాషా సౌల‌భ్యం కోసం స్థానికంగా నాయ‌కులు బాధ్య‌త‌లు తీసుకున్నారు.