జపాన్ వెళ్లినా.. బీఆర్ఎస్‌ను వదలని రేవంత్‌రెడ్డి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నారు.
By: Tupaki Desk | 19 April 2025 10:45 AMతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నారు. కీలక సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఆయన అక్కడకు వెళ్లినా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌పై విమర్శలు మాత్రం కొనసాగిస్తున్నారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా జపాన్ రాజధాని టోక్యోలో రివర్ ఫ్రంట్‌ను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోని మూసీ నదిని కూడా అభివృద్ది చేయాలని అనుకున్నట్టు చెప్పారు.
అయితే.. తెలంగాణలోని కొందరు వ్యక్తులు, పనిలేని పార్టీలు.. మూసీ నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి అడ్డు పడుతున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ``మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా.. హైదరాబాద్‌ను సుందరీకరించాలని నిర్ణయించాం. కానీ.. కొన్ని శక్తులు.. పనిలేని కొందరు నాయకులు అడ్డు పడుతున్నారు. అయినా మేం చేయాలని అనుకున్నది చేస్తాం. మూసీని సుందరీకరిస్తాం. దీనికి మీ సహకారం కావాలి`` అని టోక్యోప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అనంతరం జపాన్‌లోని తెలుగు సమాఖ్య ప్రతినిధులతోనూ రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా పెట్టుబడులు పెట్టాలంటూ వారిని కూడా ఆహ్వానించారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభి వృద్ధి చెందుతున్నాయని.. మంచి భవిష్యత్తు ఉందని.. కాబట్టి వాటిలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ఎదుగుతున్న తీరును ఈ ఏడాది జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులను కూడా ఆయన వివరించారు.