వాళ్ల 'వెన్ను' విరుస్తాం.. నేను ఆనాడే చెప్పా: సీఎం రేవంత్
డ్రగ్స్ తీసుకుని తెలంగాణ పరిధిలో అడుగు పెట్టాలంటేనే వణుకు వచ్చేలా చర్యలు ఉండాలని సీఎం చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 27 Jun 2025 12:53 AM ISTసీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగే ఇచ్చారు. రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు సెంటర్‌గా మార్చే వారిపై విరుచుకుపడ్డారు. దేశ, విదేశాలకు తలమానికంగా ఉన్న రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు.. కేంద్రంగా మార్చే వారిపై ఏమాత్రం ఉపేక్షించేది లేదన్న ఆయన.. వాళ్ల వెన్ను విరుస్తామని వ్యాఖ్యానించారు. ``ఐటీ, ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణ.. గంజాయి, డ్రగ్స్ హబ్‌గా మారితే ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు`` అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
గురువారం యాంటీ నార్కోటిక్ డేను పురస్కరించుకుని మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసి న సదస్సులో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ``తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ వైపు చూస్తే వారి వెన్ను విరుస్తాం`` అని చెప్పారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాడే చెప్పానన్నారు. తెలంగాణకు ఒక ప్రాధాన్యం ఉందన్నారు. ఉద్యమాలకు ఖిల్లా అయిన.. ఈ గడ్డ.. మత్తుకు అడ్డాగా మారితే ఇంతకన్నా అవమానం ఏముంటుందని ప్రశ్నించారు.
డ్రగ్స్ తీసుకుని తెలంగాణ పరిధిలో అడుగు పెట్టాలంటేనే వణుకు వచ్చేలా చర్యలు ఉండాలని సీఎం చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సైనికులకు కేరాఫ్‌గా ఉన్న పంజాబ్.. ప్రస్తుతం డ్రగ్స్‌కు హబ్‌గా మారిందన్నా రు. అలాంటి పరిస్థితి తెలంగాణకు రాకూడదని వ్యాఖ్యానించారు. యువతను అభివృద్ధి వైపు నడిపిం చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలో క్రీడా పాలసీని తీసుకువచ్చామన్నారు. డ్రగ్స్ నిర్మూలన బాధ్యత పౌరులపై కూడా ఉందన్నారు.
ఏపీ బాటలో..!
డ్రగ్స్ కట్టడి, నివారణకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ మాదిరిగానే `ఈగల్` వ్యవస్థను అమలు చేయా లని నిర్ణయించింది. ఇప్పటికే ఏపీలో ఈగల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు తెలంగాణ లోనూ దీనిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. తద్వారా.. గంజాయి సాగు, సరఫరా, విక్రయంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎప్పటికప్పుడు చర్యలు కూడా తీసుకుంటారు.
