Begin typing your search above and press return to search.

బాబు కేసీఆర్ గోదావరి...రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఇపుడు తన సొంత రాష్ట్ర రాజకీయ ప్రత్యర్ధులతో పాటు ఏపీకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 6:25 PM
బాబు కేసీఆర్ గోదావరి...రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
X

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఇపుడు తన సొంత రాష్ట్ర రాజకీయ ప్రత్యర్ధులతో పాటు ఏపీకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు మీద రేవంత్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే దానికి ఒక కారణం బనకచర్ల. మరో కారణం కూడా ఉంది అని రాజకీయ విశ్లేషకుల మాట.

అదేంటి అంటే తెలంగాణాలో టీడీపీని బాబు విస్తరించబోతున్నారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. టీడీపీ జనసేన బీజేపీలతో ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే విధంగా తెలంగాణాలోనూ ఏర్పాటు చేసి 2028 ఎన్నికల్లో పోటీ చేస్తారు అన్నది ఒక ప్రచారంగా సాగుతోంది.

బీజేపీ కూడా టీడీపీతో జత కలిస్తే తమకు తెలంగాణా పీఠం చేజిక్కుతుందని ఆశ పడుతోంది. దాంతో బీజేపీ టీడీపీ బంధాన్ని బలపడకుండా చూడడం కూడా కాంగ్రెస్ అజెండాలో ఉందని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ మీద ఇటు చంద్రబాబు మీద సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అన్నారు.

వారు గెలవాలీ అంటే గోదావరి నీళ్ళే కావాలని కూడా రేవంత్ రెడ్డి అనడం విశేషం. అందుకే నీటి వివాదాలకు వస్తున్నాయని కూడా రేవంత్ చెప్పారు. అంతే కాకుండా తెలంగాణా ముఖ్యమంత్రిగా తాను ఎపుడూ గొడవలను కోరుకోను అని ఆయన అన్నారు. ఏపీకి తమకు ఎలాంటి వివాదాలు కానీ గొడవలు కానీ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

కేవలం చర్చల ద్వారానే వివాదాలు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పడం విశేషం. ఈ విషయంలో అవసరం అయితే ఏపీ సీఎం చంద్రబాబుని తానే స్వయంగా ఆహ్వానిస్తా అని ఆయన అనడం మరో విశేషం. ఇక ఒక రోజు కాదు ఏకంగా నాలుగు రోజుల పాటు వరసగా చర్చలకు కూర్చునేందుకు కూడా తాను సిద్ధమని రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఇక చంద్రబాబుతో చర్చల విషయంలో ఏ రకమైన విమర్శలు వచ్చినా కూడా తాను వెనక్కి తగ్గేది లేదని కూడా ఆయన అన్నారు. ఇక బీఆర్ఎస్ మీద కూడా రేవంత్ చాలా కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అన్నది ఒక విధంగా చూస్తే రాజకీయంగా చచ్చిపోయింది అని అన్నారు. మళ్లీ నీటి వివాదాలను రెచ్చగొట్టడం ద్వారా ఉనికి చాటుకోవాలని చూస్తోందని అన్నారు.

బీఆర్ ఎస్ వల్లనే బనకచర్ల వంటి నీటి వివాదాలు వచ్చాయని కూడా చెప్పారు. హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నపుడే ఇదంతా జరిగిందని అన్నారు. ఇపుడు గోదావరి నీటి మీద వివాదాలు రాజేసి బతకాలని బీఆర్ఎస్ చూడడం దారుణం అన్నారు.

ఏపీ విషయం తీసుకుంటే కేవలం పోలవరం ప్రాజెక్టు కు మాత్రమే అనుమతి ఉందని ఆయన అంటూ బనకచర్ల పోలవరం ప్రాజెక్టునకు అనుబంధమైనది అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే దానికి బీజం పడింది అని ఇపుడు అంతా చేసి మళ్లీ వివాదం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మొత్తం మీద చూస్తే కనుక రేవంత్ వ్యాఖ్యలు సంచలనం గా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.