మోడీతో ఢీ... చర్చకు సిద్ధమన్న సీఎం రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతోనే ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు.
By: Garuda Media | 9 Jun 2026 1:54 AM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతోనే ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. మోడీ ఏం చేశారో.. తానేం చేశానో.. చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. గత 12 ఏళ్లుగా మోడీ పాలన అద్భుతంగా ఉందని బీజేపీనాయకులు సంబరాలు చేసుకుంటున్నారని.. కానీ ఆయన వల్ల ఏం ఒరిగిందని ప్రశ్నించారు. ``నా రెండేళ్ల పాలన.. మోడీ 12 ఏళ్ల పాలనపైచర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమేనా?`` అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చి.. మోడీ గద్దెపై కూర్చునేందుకు సహకరిస్తే.. ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేశారని నిలదీశారు.
గంగా, యమునా నదులను ప్రక్షాళన చేస్తే.. బీజేపీ నాయకులు చప్పట్లు కొడుతున్నారని.. కానీ, మూసీ నది ప్రక్షాళన చేస్తామం టే మాత్రం పుల్లలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రిగా ఉండి.. రాష్ట్రానికి ఏం తీసుకువచ్చారో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ``రెండేళ్ల పాలనలో నేను ఏమీ చేయలేదని.. అంటున్నారు. మరి మోడీ ఏంచేశారు. 12 ఏళ్ల పాలనపై సంబరాలు చేసుకుంటున్నారు కదా!.. `` అని వ్యాఖ్యానించారు. దేశంలోని కొన్ని అభివృద్ధి నగరాలు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను ఎ దుర్కొంటున్నాయని తెలిపారు. దేశరాజధాని ఢిల్లీలో నివసించే పరిస్థితి కూడా లేదన్నారు. అందుకే ప్రధానమంత్రి తన కార్యాలయాన్ని కూడా మార్చుకున్నారన్నారు.
కానీ, హైదరాబాద్‌కు అంత దుస్థితి రాలేదని.. రానివ్వబోనని సీఎంరేవంత్ చెప్పారు. అందుకే మూసీ ప్రక్షాళనను చేపట్టి తీరుతా మని చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా.. ఈ కార్యక్రమం ఆగదన్నారు. రాజకీయాలు చేయాలని అనుకునే వారు.. ఎన్నిక ల వరకు ఆగాలని సూచించారు. ఎన్నికలకు ముందు వరకు రాజకీయాలు చేయొచ్చని.. కానీ, ఇప్పటి నుంచి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ``మన హైదరాబాద్ నివాసానికి అనుకూలంగా ఉంది. పెద్ద నగరాలకు ఉన్న సమస్యలు హైదరాబాద్‌లో లేకుండా చూసేందుకు నిపుణులతో కమిటీ వేశాం.`` అని తెలిపారు. కాగా.. సైబరాబాద్‌లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు.
