Begin typing your search above and press return to search.

మంత్రులు ఖుషీ.. రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం

మంత్రుల‌తో ఆయ‌న‌కు గ్యాప్ ఉందని.. ఆయ‌న వెనుకాల మంత్రులు ఏదో మంత్రాంగం చేస్తున్నార‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు

By:  Tupaki Desk   |   6 Jun 2025 6:18 PM IST
మంత్రులు ఖుషీ.. రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మంత్రుల‌తో ఆయ‌న‌కు గ్యాప్ ఉందని.. ఆయ‌న వెనుకాల మంత్రులు ఏదో మంత్రాంగం చేస్తున్నార‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే నెల‌కు రెండు సార్లు మంత్రివ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించా రు. ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి ఈ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

తాజా నిర్ణ‌యం మేర‌కు.. ప్ర‌తి నెల 1వ‌, 3వ శ‌నివారాల్లో కేబినెట్ బేటీ నిర్వ‌హించ‌నున్నారు. త‌ద్వారా.. వి ధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునేందుకు.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు కూడా.. ఇబ్బందులు త‌గ్గు తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు-ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌కుండా చూ సేందుకుఅవ‌కాశం ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. మ‌రో రెండు కార‌ణా లు కూడా ఉన్నాయ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

1) మంత్రులకు-ముఖ్య‌మంత్రికి మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపి స్తోంది. గ‌త కొన్నాళ్లుగా మంత్రుల వ్య‌వ‌హారం చ‌ర్చ‌గా మారింది. ముఖ్య‌మంత్రి త‌మ‌తో ఎలాంటి సంప్ర దింపులు చేయ‌డం లేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అలాగే కీల‌క నిర్ణ‌యాల‌పైనా త‌మ‌ను సంప్ర‌దిం చ‌డం లేద‌ని కూడా వారు భావిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కేబినెట్ భేటీల‌కు ముఖ్య మంత్రి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

2) మంత్రుల ప‌నితీరును అంచ‌నా వేసేందుకు కూడా కేబినెట్ భేటీలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని సీఎం రేవం త్‌రెడ్డి భావిస్తున్న‌ట్టు సమాచారం. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కు ఒక్క‌సారి ఖ‌చ్చితంగా కేబినెట్ భేటీ ఉంటోంది. ఒక్కొక్క‌సారి సుదీర్ఘంగా ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు చ‌ర్చిస్తున్నా.. మ‌రికొన్నిసార్లు కేవ‌లం ఒక పూట‌కే ప‌రిమితం చేస్తున్నారు. అయితే.. కేబినెట్ నిర్వ‌హ‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌క్షాన బ‌ల‌మైన సంకేతాలు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.