Begin typing your search above and press return to search.

ఆ వాలంటీర్లకు షాక్... రిటర్నింగ్ అధికారి కీలక ఆదేశాలు!

ఈ సమయంలో రిటర్నింగ్ అధికారి 23 మంది వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   21 March 2024 4:35 PM GMT
ఆ వాలంటీర్లకు షాక్... రిటర్నింగ్  అధికారి కీలక ఆదేశాలు!
X

ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వాలంటీర్ల వ్యవస్థ అనేది హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఒక ఏడాది కాలం నుంచి ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. పైగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్షన్ విధుల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ప్రకటన రావడంతో వీరిపై మరింత కాన్ సంట్రేషన్ పెరిగింది. ఈ సమయంలో రిటర్నింగ్ అధికారి 23 మంది వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. ఈ వ్యవస్థపై టీడీపీ, జనసేన చేసిన విమర్శలు, ఆరోపణలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇంతలోనే ఏమైదో తెలియదు కానీ... వాలంటీర్ వ్యవస్థలకు అనుకూలంగా విపక్షాల నుంచి కామెంట్లు వెలువడ్డాయి. వారిని పంచాయతీలతో అనుసంధానం చేస్తామనే చర్చా తెరపైకి వచ్చింది. మరోపక్క వాలంటీర్లు తన సైన్యం అని జగన్ చెబుతూనే ఉన్నారు!

ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది! అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఇటీవల టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి ఈ విషయంపై సీరియస్ గా స్పందించారని అంటున్నారు. ఇందులో భాగంగా వీరిని సస్పెండ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి కే. దినేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.

కాగా... ఇప్పటికే పలువురు వాలంటీర్లు సస్పెషన్ కు గురైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎన్నికల ప్రవర్తనా నియామావళి పాటించకుండా వైసీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారంటూ.. 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే తాజాగా రాజమండ్రిలోని స్థానిక 44వ వార్డు పరిధిలోని సచివాలయం 76, 77లకు చెందిన వాలంటీర్లను సస్పెండ్ చేశారు.