Begin typing your search above and press return to search.

స్పెషల్ హోటల్... మీరు ఎంత సన్నగా ఉంటే అంత డిస్కౌంట్!

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది.. అంటారు. ఈ మాటకు బలం చేకూరుస్తూ... మలేషియాలోని ఒక రెస్టారెంట్ యాజమాన్యం డిఫరెంట్ గా ఆలోచించింది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 6:02 PM GMT
స్పెషల్ హోటల్... మీరు ఎంత సన్నగా ఉంటే అంత డిస్కౌంట్!
X

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది.. అంటారు. ఈ మాటకు బలం చేకూరుస్తూ... మలేషియాలోని ఒక రెస్టారెంట్ యాజమాన్యం డిఫరెంట్ గా ఆలోచించింది. రొటీన్ కి భిన్నంగా సరికొత్తగా డిస్కౌంట్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మీరు ఎంత సన్నగా ఉంటే అంత ఎక్కువగా డిస్కౌంట్ పొందుతారు. అది కూడా ఏకంగా 10 శాతం నుంచి 100 శాతం వరకూ కూడా కావడం గమనార్హం.

అవును... మలేషియాలోని కూచింగ్ అనే రెస్టారెంట్‌ లోని మంగోలియన్ మాస్టర్‌ కు ఒక అసాధారణ ఆలోచన వచ్చింది. ఇందులో భాగంగా ఆ హోటల్ కి వచ్చే కస్టమర్ ఎంత సన్నగా ఉంటే అంత ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ రెస్టారెంట్ లోకి వెళ్లగానే వివిద సైజుల్లో గ్రిల్స్ ఉంటాయి. ప్రతీ గ్రిల్ వద్ద డిస్కౌంట్ పర్సంటేజ్ తెలుపుతూ బోర్డ్ ఉంటుంది.

ఆ రెస్టారెంట్ కి వచ్చిన కస్టమర్లు ఏ గ్రిల్ నుంచి సులబంగా ఎంట్రీ ఇస్తారో వారికి ఆ గ్రిల్ పై ఉన్న డిస్కౌంట్ ప్రకారం బిల్ లో రాయితీ వస్తుందన్నమాట. ఇది 100శాతం వరకూ కూడా ఉంది. స్టార్టింగ్ 10 శాతం నుంది అప్లై అవుతుంది. దీంతో... రెస్టారెంట్లలో ఈ ప్రత్యేక తగ్గింపులు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో వీటిలో ఐదు ఎంట్రీలు ఉంటాయి.

ఇందులో మొదటి ఎంట్రీ గ్రిల్ లో 10శాతం, రెండో గ్రిల్ లో 20, మూడో గ్రిల్ లో 30, నాలుగో గ్రిల్ లో 50 శాతం డిస్కౌంట్ లు ఉండగా... ఐదో గ్రిల్ లో ఏకంగా 100శాతం డిస్కౌంట్ ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని డిస్కౌంట్లను కూడా ఈ రెస్టారెంట్ ప్రవేశపెట్టింది. అయితే ఇవి అప్పుడప్పుడూ విన్నట్లుగానే ఉంటాయి.

ఇందులో భాగంగా... రెండు డిష్ లను కొనుగోలు చేయండి, ఒకదానికి మాత్రమే చెల్లించండి.. €50 ఖర్చు చేయండి, €10 గిఫ్ట్ వోచర్‌ ను తిరిగి పొందండి.. మెయిన్ కోర్సును కొనుగోలు చేయండి, డెజర్ట్‌ ను ఉచితంగా పొందండి వంటివి కూడా ఉంటాయి.