Begin typing your search above and press return to search.

'మ‌హిళ‌' లేకుండా.. రాజకీయాలు సాధ్యం కావా ..!

రాజ‌కీయాల‌లో నాయ‌కులు ఎదిగేందుకు.. ప్ర‌జ‌ల ఆక‌ర్ష‌ణ పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2025 8:30 AM IST
మ‌హిళ‌ లేకుండా.. రాజకీయాలు సాధ్యం కావా ..!
X

రాజ‌కీయాల‌లో నాయ‌కులు ఎదిగేందుకు.. ప్ర‌జ‌ల ఆక‌ర్ష‌ణ పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ప్ర‌జ ల‌కు సేవ చేయ‌డం ద్వారా.. వారికి చేరువ కావ‌డంద్వారా మ‌న‌న్న‌లు పొందిన నాయ‌కులు ఉన్నారు. కానీ .. ఏపీలో దౌర్భాగ్య‌క‌ర రాజ‌కీయాలు సాగుతున్నాయి. మ‌హిళ‌ల ప్ర‌స్థావ‌న పెరిగిపోతోంది. ఏ కార్య‌క్ర మానికి వెళ్లినా.. ఏ చ‌ర్చ జ‌రిగినా మ‌హిళ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని నాయ‌కులు చెల‌రేగిపోతున్నారు. ఈ త‌ర‌హా రాజ‌కీయాలే త‌మ‌ను నాయ‌కుల‌ను చేస్తాయ‌ని భావిస్తున్నారో ఏమో!?

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న‌వారు.. ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారు కూడా.. మ‌హిళ‌ల‌ను కేం ద్రంగా చేసుకుని రాజకీయాలు చేశారు. నోరు విప్పితే బూతులు.. నోరు తెరిస్తే.. బూతులు అన్న‌ట్టుగా రాజ‌కీయాలు మారాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. అనేక సంద‌ర్భాల్లో నాయ‌కులు చెల‌రేగి పోయారు. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు ఒక్క ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం మ‌రో విశేషం. దేశంలో ఎక్క‌డా కూడా.. ఇలాంటి రాజ‌కీయాలు సాగ‌డం లేదు.

ఇది ప్ర‌స్తుతం ఏపీ బ్రాండ్‌ను ఘోరంగా దెబ్బ‌తీస్తోంది. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు రాజ‌కీయంగా వ్యాపారాల ప‌రంగా కూడా.. ప్రాధాన్యం పెంచుతున్న నేటి ప్ర‌పంచంలో వారిని గౌరవించ‌డం అనేది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌. ఇది మ‌రీ ముఖ్యంగా నాయ‌కుల నుంచే రావాలి. కావాలి. కానీ, అక్క‌డే అదుపు త‌ప్పుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక పార్టీపై మ‌రో పార్టీ పైచేయి సాధించే క్ర‌మంలో మ‌హిళ‌ల‌ను ఆట వ‌స్తువులుగా చూపిస్తున్న ప‌రిస్థితి దారుణమ‌నే చెప్పాలి.

తాజాగా అమ‌రావ‌తి మ‌హిళల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ సహించ‌రు. చేయ‌కూడ‌దు కూడా. దీనిని అందరూ ఖండిస్తున్నారు. అయితే.. ఒక్క‌సారితో స‌మ‌సిపోవాల్సిన ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను కొన్ని చానెళ్లు ప‌దే ప‌దే చూపించ‌డం కూడా త‌ప్పేన‌న్నది మేధావి వ‌ర్గాలు చెబుతున్న మాట‌. నిజానికి మ‌హిళ‌లు కూడా రాజ‌కీయాల్లో రాణించాల‌ని కోరుకుంటున్న స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు.. అన‌డ‌మే కాదు.. వాటిని ప‌దే ప‌దే ప్ర‌చారం చేయ‌డం కూడా త‌ప్పే. రాజ‌కీయాలు మారాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న‌ది మేధావులు చెబుతున్న మాట‌.