Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ డేట్‌ కి హెల్ప్ ప్లీజ్ అంటూ మంత్రికి రిక్వస్ట్... రియాక్షన్ వైరల్!

ఇందులో భాగంగా తన డ్రీం గర్ల్‌ తో బయటకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం కావాలని ఏకంగా మంత్రినే అడిగాడో ఓ వ్యక్తి. ఈ ఊహించని ప్రశ్న హాట్ టాపిక్ గా మారగా.. దీనీకి మంత్రి గారి రియాక్షన్ మరింత వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:30 AM GMT
ఫస్ట్‌  డేట్‌  కి హెల్ప్  ప్లీజ్  అంటూ మంత్రికి రిక్వస్ట్... రియాక్షన్  వైరల్!
X

సాధారణంగా రాజకీయ నాయకులకు ఎదురయ్యే రిక్వస్ట్ లు రోడ్లు బాగా లేవనో, తాగునీరు సరఫరా కావాలనో, జాబ్స్ కల్పించాలనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే దిశగా చర్యలు తీసుకొవాలనో, కరెంట్ ఛార్జీలు తగ్గించమనో ప్రజలు రిక్వస్టులు పెడుతుంటారు. కారణం... స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ ఈ సమస్యలు భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కామన్ కాబట్టి! ఈ సమయంలో తాజాగా మంత్రిని విచిత్రమైన కోరిక కోరాడో వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యవహారం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

అవును... నాగాలాండ్ బీజేపీ అధ్యక్షుడు, మంత్రి తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్‌ కు తాజాగా ఒక విచిత్రమైన అభ్యర్థన వచ్చింది. ఇందులో భాగంగా తన డ్రీం గర్ల్‌ తో బయటకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం కావాలని ఏకంగా మంత్రినే అడిగాడో ఓ వ్యక్తి. ఈ ఊహించని ప్రశ్న హాట్ టాపిక్ గా మారగా.. దీనీకి మంత్రి గారి రియాక్షన్ మరింత వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగాలాండ్ మంత్రి తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్‌ ను ఒక వ్యక్తి కీలక అభ్యర్ధన చేశాడు. ఇందులో భాగంగా... అక్టోబర్ 31న తాను తన డ్రీం గర్ల్ తో మొట్ట మొదటిసారి డేట్‌ కు వెళ్తున్నట్లు తెలిపాడు. అయితే... తనకు ఎలాంటి సంపాదనా లేదని, అందువల్ల చిన్న సహాయం కావాలని, ఏదైనా చేయండని మంత్రిని అభ్యర్థించాడు.

దీంతో ఈ రిక్వస్ట్ పై స్పందించిన మంత్రి... "నన్ను ఏమి చేయమంటారో చెప్పండి" అని అడిగి ఆశ్చర్యపర్చారు. దీంతో... ఈ సంభాషణపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ఇందులో భాగంగా... ఆ వ్యక్తి స్థానంలో మంత్రిని డేట్‌ కు వెళ్లమని కొంతమంది స్పందిస్తే... మరికొందరు ఆ లవర్‌ బాయ్‌ ను ఎమ్మెల్యే చేయండంటూ పోస్టులు పెట్టారు. ప్రస్తుతం ఆ సంభాషణ, దానికి నెటిజన్లు పెట్టిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

కాగా... రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకునే పోస్టులు పెట్టే నాగాలాండ్ బీజేపీ చీఫ్ తెమ్జెన్‌.. గతంలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గూగుల్‌ లో "తెమ్జెన్‌ భార్య ఈమె" అంటూ కనిపించిన స్క్రీన్‌ షాట్‌ ను షేర్ చేస్తూ.. "గూగుల్ నన్ను ఉత్సాహానికి గురిచేసింది. నేను ఇప్పటికీ ఆమె కోసం వెతుకుతున్నాను" అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ కామెంట్ ఫుల్ వైరల్ అయ్యింది!

ఈ క్రమంలో తాజాగా తన డ్రీం గర్ల్ తో ఫస్ట్ టైం డేట్ కి వెళ్తున్నాను.. కానీ తన వద్ద డబ్బులు లేవు, ఏదైనా సాయాం చేయండి అంటూ అడిగిన నెటిజన్ రిక్వస్ట్ కు పై విధంగా స్పందించారు తెంజెన్. ఇప్పుడు ఈ సంబాషణ వైరల్ అవుతుంది!