Begin typing your search above and press return to search.

ఈ ఏడాది ఎంత మంది జర్నలిస్ట్ లు చనిపోయారో తెలుసా?

విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం ఎదురొడ్డి నిలబడేవారిలో జర్నలిస్ట్ లు కూడా ముందు వరసనే చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   14 Dec 2023 12:46 PM GMT
ఈ ఏడాది ఎంత మంది జర్నలిస్ట్ లు చనిపోయారో తెలుసా?
X

విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం ఎదురొడ్డి నిలబడేవారిలో జర్నలిస్ట్ లు కూడా ముందు వరసనే చెప్పవచ్చు. బార్డర్ లో సైనికులు బుల్లెట్లకు గుండె ఎదురొడ్డి నిలిస్తే.. బార్డర్ తో పాటు దేశంలో అవినీతి పరులు, స్వార్థ పరులు, నర హంతకుల మధ్య నిలుస్తారు జర్నలిస్ట్ లు. కొన్ని కొన్ని వార్తలు వారి ప్రాణాల మీదకు తెస్తుందని తెలిసినా ఏ మాత్రం పట్టించుకోకుండా ఎదురెళ్తారు. ఎన్నో కుంభ కోణాలును వెలికి తీసిన ఘనత జర్నలిస్ట్ లపై ఉంది. భారతదేశంలో అత్యంత భారీ స్కాం ‘తెల్గీ స్టాంప్ పేపర్’ను బహిర్గతం చేసింది కూడా ఒక జర్నలిస్ట్.

అయితే జర్నలిస్ట్ లు భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. వారి లైఫ్ కు కూడా గ్యారెంటీ అనేది లేకుండా పోతోంది. జర్నలిస్ట్ ల లైఫ్ పై ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో సంచలన విషయాలు బయట పడ్డాయి. అందులో ఏమున్నదంటే.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 45 మంది జర్నలిస్ట్ లు హత్యకు గురైనట్లు చెప్పింది.

మిడిల్ ఈస్ట్ యుద్ధం 2002తో పోల్చుకుంటే ఇదే తక్కువనే చెప్పింది.

హమాస్-ఇజ్రయెల్ మధ్య జరుగుతున్న వార్, అక్కడి పరిస్థితులను వివరించే క్రమంలో దాదాపు 13 మంది జర్నలిస్ట్ లు మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇంకా 2022 - 2023 సంవత్సరంలో విధి నిర్వహణలో దాదాపుగా 600 మంది వరకు జర్నలిస్ట్ లు మరణించినట్లు నివేదిక పేర్కొంది.

రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ నివేదికతో చాలా మంది జర్నలిస్ట్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో మృత్యువాత పడుతున్నా ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రం తమను ఆధుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని దేశాల్లోకి వెళ్లిన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ లు హత్యకు సైతం తెలిసిందే. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ నివేదిక తమ భద్రతపై ప్రభుత్వాలకు వివరించిందని అనుకుంటున్నారు.