Begin typing your search above and press return to search.

స్ట్రాంగ్ ఉమన్... రేణు దేశాయ్ డబ్బులు తీసుకోకుండా చేసిన పోస్ట్ వైరల్!

ఈ సందర్భంగా రేణూ దేశాయ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఇందులో భాగంగా... ఈ పోస్ట్ కోసం తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, తనకు అనిపించిందే షేర్ చేశానని తెలిపారు.

By:  Tupaki Desk   |   26 April 2024 7:48 AM GMT
స్ట్రాంగ్  ఉమన్... రేణు దేశాయ్  డబ్బులు తీసుకోకుండా చేసిన పోస్ట్  వైరల్!
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా పలు పార్టీలకు స్టార్ క్యాంపెయినర్లు తెరపైకి వస్తుండగా.. మరికొంతమంది నేతలకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వ్యక్తిగతంగా ప్రమోట్ చేస్తున్నారు! ఆ సంగతులు అలా ఉంటే... జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా ఆమె రాజకీయాలకు సంబందించి స్పందించడం గమనార్హం!

వాస్తవానికి గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటున్నట్లు కనిపిస్తున్న రేణూ దేశాయ్... పవన్ తో విడిపోయిన తర్వాత తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు! నిన్నమొన్నటివరకూ ఇండస్ట్రీకి దూరం అయినట్లు కనిపించినప్పటికీ... సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత అభిప్రాయాలనూ, పిల్లల విషయాలనూ ఫ్యాన్స్ తో పంచుకుంటూనే ఉన్నారు.

అంతకముందు తన రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు రావడం.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం.. దీంతో నెట్టింట రచ్చ రచ్చ జరగడం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆమె స్ట్రాంగ్ గా నిలబడ్డారు.. గట్టిగా రియాక్ట్ అయ్యారు! అనంతరం ఇటీవల ఆమె సినిమాల్లోనూ కనిపించారు. ఇందులో భాగంగా.. రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించారు.

ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో... తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఆమె బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోను పోస్ట్ చేస్తూ... "స్ట్రాంగ్ ఉమన్" అని పేర్కొంటూ ప్రశంసించారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మహిళను చూశానని రేణు చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా రేణూ దేశాయ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఇందులో భాగంగా... ఈ పోస్ట్ కోసం తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, తనకు అనిపించిందే షేర్ చేశానని తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. తన అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేయడం తప్పులేదు కానీ... "దీని కోసం తాను ఎవరి దగ్గరా ఎటువంటి డబ్బులూ తీసుకోలేదని" నొక్కి చెప్పడం కాస్తా మరింత చర్చనీయాంశం అయ్యింది! దీంతో... తాను అమ్ముడుపోయే మనిషి కాదన్నట్లు అర్ధం వచ్చేలా రేణు పోస్ట్ చేశారని ఈ సందర్భంగా పలువురు ఇంటర్ ప్రిటేషన్ చేస్తున్నారు.