కర్నూలు ఖుషీ.. 'కంపాకోలా' భారీ ఇన్వెస్ట్‌మెంట్!
వెనుక బడిన జిల్లాగా.. సాగునీరు పెద్దగా అందని జిల్లాగా పేరున్న కర్నూలుకు.. భారీ పెట్టుబడి తరలి వచ్చింది.
By: Tupaki Desk | 27 Jun 2025 2:03 PM ISTవెనుక బడిన జిల్లాగా.. సాగునీరు పెద్దగా అందని జిల్లాగా పేరున్న కర్నూలుకు.. భారీ పెట్టుబడి తరలి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలో `కూల్ డ్రింక్స్` రంగంలో పెట్టుబడులు పెట్టేం దుకు ఏపీని ఎంచుకున్నారు. దీనికి కూటమి సర్కారు వెనువెంటనే అంగీకారం తెలిపింది. దీంతో సంస్థ సర్వహంగులతో ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
ఇప్పటికే అనేక రంగాల్లో ఉన్న అంబానీ.. తాజాగా కోకోకోలాకు పోటీగా.. `కంపా కోలా` పేరుతో ఆయన కూల్ డ్రింక్స్ రంగంలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. దీనిలో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి సమీ పంలో ఉన్న పారిశ్రామిక వాడలో రిలయన్స్‌పేరుతో ఈ కూల్ డ్రింక్స్ పరిశ్రమలను స్థాపించనున్నారు. ప్రారంభంలోనే 1650 కోట్ల రూపాయలను అంబానీ పెట్టుబడి పెట్టనున్నారు. సుమారు 80 ఎకరాలను అంబానీకి ప్రభుత్వం ఇటీవలే కేటాయించింది.
ఏపీ ఆహార తయారీ విధానం(ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ) 4.0 ప్రకారం ఈ భూములు రిలయెన్స్‌కు కేటాయిం చారు. దీనిలో ఒక్కొక్క ఎకరాన్ని 30 లక్షల రూపాయలకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. వచ్చే 20 రోజుల్లోనే ఇక్కడ రిలయన్స్ పనులు ప్రారంభించనుంది. పనుల్లోనూ.. ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటయ్యా క.. ఇక్కడి వారికి 1200-1500 మధ్య ఉపాధి కల్పించనున్నారు. అయితే.. ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు మాత్రం కొంత సమయం పడుతుంది. తద్వారా.. స్థానికంగా ఉన్న యువతకు, మహిళలకు కూడా ఈ కూల్ డ్రింక్ పరిశ్రమ రంగంలో ఉపాధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
