Begin typing your search above and press return to search.

సరికొత్త రికార్డ్.. కోటీ ఇరవై ఆరు లక్షలు పలికిన గణపతి లడ్డూ!

అదేవిధంగా హైదరాబాద్ గణపతి లడ్డూ గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గణపతి లడ్డు సరికొత్త రికార్డు సృష్టించింది. వేలంలో ఏకంగా 1.26 కోట్లు పలికింది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 12:53 PM GMT
సరికొత్త రికార్డ్.. కోటీ ఇరవై ఆరు లక్షలు పలికిన గణపతి లడ్డూ!
X

హైదరాబాద్‌ లో వినాయక చవితి ఉత్సవాలు ఏ రేంజ్ లో జరుగుతాయనేది అందరికీ తెలిన విషయమే. ఇక ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించి చెప్పేపనే లేదు. అదేవిధంగా హైదరాబాద్ గణపతి లడ్డూ గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గణపతి లడ్డు సరికొత్త రికార్డు సృష్టించింది. వేలంలో ఏకంగా 1.26 కోట్లు పలికింది.

అవును... హైద్రాబాద్ రాజేంద్రనగర్ బండ్లగూడలోని రిచ్‌ మండ్ విల్లస్ లో ఏర్పాటుచేసిన గణపతి లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది. విల్లాస్‌ లో ఉండే ఐదురుగు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి రూ. 1.26 కోట్లకు గణపతి లడ్డూను దక్కించుకున్నారు. ఇది గతేడాది పలికిన ధర కంటే రెట్టింపు కావడం గమనార్హం.

2021లో ఇక్కడ గణపతి లడ్డూ రూ. 41 లక్షలు పలకగా.. గతేడాది 2022 లో రూ. 60.80 లక్షలు పలికింది. ఆ రికార్డులన్నీ చెరిపేస్తూ ఈ ఏడాది తాజాగా బండ్లగూడ గణపతి లడ్డూ ఏకంగా రూ. 1.26 కోట్లకు పలికింది. ఈ మొత్తాన్ని హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి ఛారిటీ కార్యక్రమాలకు వాడతామని తెలిపారు. ఫలితంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. హైదరాబాద్ గణపతి లడ్డూ చరిత్రలో ఇదే అత్యధికం కావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం పేర మారుమోగిపోయింది.

ఇక ఇక మాదాపూర్ మైహోం భూజాలో వినాయకుడి లడ్డూ కూడా రికార్డు ధర పలికింది. తాజాగా జరిగిన వేలంలో 25.50 లక్షలకు ఓ భక్తుడు ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది ఈ లడ్డు వేలం 18.50 లక్షలకు పోగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 25.50 లక్షలు పలికింది.

ఇదే సమయంలో ఈ ఏడాది బాలాపూర్ గణేశ్ లడ్డూ కూడా మరో రికార్డ్ సృష్టించింది. 21 కేజీల లడ్డూ ఏకంగా 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు ఒక భక్తుడు! వాస్తవానికి ప్రతీ ఏటా హైదరాబాద్ సిటీలో బాలాపూర్ లడ్డూ వేలానిదే పైచేయిగా ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం బాలాపూర్ తన అగ్రస్థానాన్ని కోల్పోగా.. బండ్లగూడ లో వేసిన వేలం పాట అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ 1.26 కోట్లు పలికింది.

అదేవిధంగా... నల్లగొండ పట్టణంలో లడ్డూ కూడా ఈ ఏడాది రికార్డు ధర పలికింది. పాతబస్తీలో హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను ఓ భక్తుడు 36 లక్షలకు సొంతం చేసుకున్నారు. గతేడాది రూ.11 లక్షలు పలికిన ఈ లడ్డూ.. ఈ సారి ఏకంగా రూ.36 లక్షలు పలకడం గమనార్హం.

నల్లగొండ జిల్లా అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు, దళిత నాయకుడు పెరిక కిరణ్‌ జయరాజు ఈ లడ్డూను చేజిక్కించుకున్నారు.

లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకులు:

కులమతాలు అతీతంగా వినాయక చవితి పండగ, నిమజ్జన మహోత్సవం జరుగుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ తాజాగా జరిగింది. ఇందులో భాగంగా... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 21 కేజీల గణపతి లడ్డూని వేలం వేయగా... దాన్ని మహాలక్ష్మీవాడకు చెందిన ముస్లిం యువకుడి షేక్ అసిఫ్, లక్షా 2 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నాడు.

ఇదే సమయంలో హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లిలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంలో.. తాహేర్ అలీ అనే ఉపాధ్యాయుడు దక్కించుకున్నారు. వేలంపాటలో ఆయన రూ. 23,100 కు లడ్డూను దక్కించుకున్నారు.