బంగారం ధర ఆల్ టైం రికార్డ్ హై..
బంగారం.. ఈ మాట వినడానికే కాదు పలకడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. కారణం పెరుగుతున్న ధరలు.
By: Madhu Reddy | 7 Oct 2025 1:17 PM ISTబంగారం.. ఈ మాట వినడానికే కాదు పలకడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. కారణం పెరుగుతున్న ధరలు. ఒకప్పుడు బంగారం ధరలు సామాన్యుడిని మొదలుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవి. దీంతో సమయం సందర్భం లేకపోయినా చేతిలో డబ్బు ఉంటే చాలు బంగారం కొనడానికి ఆసక్తి కనబరిచేవారు. పైగా బంగారం దుకాణాలు కూడా కస్టమర్లతో కళకళలాడేవి. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలలో ఊహించని మార్పులు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు బంగారం ధరలలో మార్పు అంటే కేవలం 100 నుంచి 200 మాత్రమే ధరలు పెరిగేవి. కానీ ఇప్పుడు ప్రతిరోజు వెయ్యి రూపాయలు పైగా బంగారం పై ధరలు పెరుగుతుంటే.. అసలు ఈ బంగారం ఇక భవిష్యత్తులో కొనగలమా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
పెట్టుబడి కోసం ఉపయోగించే 24 క్యారెట్స్ బంగారం ధరల సంగతి అటు ఉంచితే.. ఆభరణాల కోసం ఉపయోగించేటువంటి 22 క్యారెట్స్ బంగారం ధరలు కూడా ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. సుమారుగా ఈమధ్య 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,10,000 కి పైమాటే.. ప్రతి ఒక్కరికి అందనంత ఎత్తులో నిలబడిన ఈ బంగారం ధరలు ఇప్పుడు ఈరోజు కూడా సుమారుగా తులం పై 1250 పెరిగి మరోసారి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ప్రతిరోజు బంగారం ధరలు పెరుగుతూ ఆల్ టైం రికార్డు సృష్టిస్తున్న వేళ ఈరోజు పెరిగిన ధరలతో బంగారం ధర ఎంత ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
హైదరాబాదు బులియన్ మార్కెట్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం పై రూ.1, 250 పెరిగి.. 10 గ్రాముల తులం బంగారం ధర 1,22,020 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1,150 ఎగబాకి రికార్డ్ స్థాయిలో రూ.1, 11,850 కి చేరుకుంది. ఇక బంగారం ధరలే కాదు వెండి ధరలలో కూడా భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఒక్కరోజే కేజీ బంగారం పై వంద రూపాయలు పెరిగి రూ.1,67,100 కి చేరుకుంది. అటు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి . ముఖ్యంగా విజయవాడ, అనంతపురం, గుంటూరు, కృష్ణ వంటి ప్రధాన నగరాలతో పాటు అటు తెలంగాణలో హైదరాబాదు, ఖమ్మం, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇకపోతే బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడంతో సామాన్యులు ఎప్పుడో బంగారం కొనుగోలు చేయడం ఆపేశారు. ఇప్పుడు ధనవంతుడు కూడా బంగారం. కొనుగోలు చేయాలి అంటే వెనుకడుగు వేస్తున్నారు ఉదాహరణకు రెండు తులాలు కొనుగోలు చేయాల్సిన చోట కనీసం అర తులం కూడా కొనాలంటే ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. బంగారం ధరలు రోజురోజుకీ పెరిగిపోతే ఇక బంగారం ఎవరి కొనుగోలు చేస్తారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఇదే సమయంలో కార్యాలను పూర్తి చేయడానికి అందరూ రోల్డ్ గోల్డ్ పై ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి కూడా ఏటా మన భారతదేశంలో 22 వేల కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోందని సమాచారం.
