నాలుగేళ్లలో ఇలాంటి రోజు ఒక్కటే.. ఎంతగా దూసుకెళ్లాయంటే?
ఇప్పటివరకు బ్లాక్ మండేలు చాలానే చూశాం. కానీ.. మెరుపుల మండే (సోమవారం)ను ఇటీవల కాలంలో చూడలేదు. సానుకూల వాతావరణం ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ దూసుకెళ్లటం మామూలే. కానీ.. ఈ స్థాయిలో మాత్రం ఇటీవల కాలంలో చూసింది లేదు.
By: Tupaki Desk | 13 May 2025 6:36 AMఇప్పటివరకు బ్లాక్ మండేలు చాలానే చూశాం. కానీ.. మెరుపుల మండే (సోమవారం)ను ఇటీవల కాలంలో చూడలేదు. సానుకూల వాతావరణం ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ దూసుకెళ్లటం మామూలే. కానీ.. ఈ స్థాయిలో మాత్రం ఇటీవల కాలంలో చూసింది లేదు. ఎందుకంటే.. ఒక్కరోజంటే ఒక్క రోజులో బూల్ దూకుడు చూసినోళ్లకు కడుపు నిండిపోయిన పరిస్థితి. బుల్ దూకుడుతో స్టాక్ మార్కెట్ లో ఎంతటి జోష్ వచ్చిందన్న విషయాన్ని సింఫుల్ గా రెండు అంకెల్లో ఇట్టే చెప్పేయొచ్చు.
సోమవారం ఒక్క రోజే సెన్సెక్స్ 2975 పాయింట్లు దూసుకెళితే.. నిఫ్టీ 917పాయింట్లు దూసుకెళ్లింది. నాలుగేళ్ల కాలంలో ఒక్కరోజులో ఇంతటి భారీ పెరుగుదల ఇదే తొలిసారి కావటం మరో విశేషం. సుచీల 4 శాతం ర్యాలీతో స్టాక్ మార్కెట్ లో ఒక్క రోజే రూ.16.15 లక్షల కోట్ల సంపదను క్రియేట్ చేసింది. దీంతో ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.422.56 లక్షల కోట్లకు చేరింది.
దీనికి కారణం ఓవైపు భారత్ పాక్ మధ్యన సీజ్ ఫైర్. మరోవైపు అమెరికా చైనాల మధ్య ట్రేడ్ ఒప్పందాలతో సెంటిమెంట్ బలపడటంతో పాటు.. సానుకూల సంకేతాలతో మార్కెట్ల సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ ఊపు ఎక్కడా తగ్గలేదు. ఇంట్రాడేలో అన్ని రంగాల్లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. దీంతో సూచీలు మరిన్ని లాభాల్ని సొంతం చేసుకున్నాయి.
ఒకానొక దశలో సెన్సెక్స్ 3041 పాయింట్లకు దూసుకెళ్లగా.. నిఫ్టీ 937 పాయింట్లవరకు ఎగిసింది. కానీ చివరకు కాస్త తగ్గాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ.. రేపు కూడా మార్కెట్లు సానుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. పాకిస్తాన్ అప్పుడప్పుడు చేస్తున్న కాల్పుల వైనం మార్కెట్ కు కాస్త మైనస్ గా మారినా.. మొత్తంగా సానుకూల వాతావరణమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ అంచనాలన్నీ కూడా రాజకీయ పరిస్థితుల అంచనాతో చెప్పటమే తప్పించి.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించే ఉద్దేశంతో మాత్రం చెప్పటం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరికి వారు వారి విచక్షణతో మాత్రమే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలన్న ప్రాథమిక సత్యాన్ని మర్చిపోకూడదు.