వైసీపీ 'వ్యతిరేకత' పదిలం ..!
సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సానుభూతి పెరగాలి. ప్రజల్లో చర్చకు కూడా రావాలి. కానీ, అదేంటో వైసీపీకి మాత్రం ఇంకా వ్యతిరేకత అలానే ఉంది.
By: Garuda Media | 28 Nov 2025 4:00 PM ISTసాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సానుభూతి పెరగాలి. ప్రజల్లో చర్చకు కూడా రావాలి. కానీ, అదేంటో వైసీపీకి మాత్రం ఇంకా వ్యతిరేకత అలానే ఉంది. మరింత పెరుగుతోందన్న చర్చ కూడా సాగుతోంది. గత ఎన్నికల తర్వాత ఇప్పటికి 17 మాసాలు పూర్తయ్యాయి. ఈ 17 మాసాల్లో పార్టీ పుంజుకోవడం ఎలా ఉ న్నా.. వ్యతిరేకతను తగ్గించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ దిశగా వైసీపీ ప్రయత్నం చేయలేదు. ఫలితంగా వ్యతిరేకత పదిలంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
ప్రధానంగా మూడు కారణాలు వైసీపీ వ్యతిరేకతను శాసిస్తున్నాయన్న వాదనను పరిశీలకులు చెబుతున్నారు.
1) కార్యకర్తల వ్యవహార శైలి: ఏ పార్టీలో అయినా.. కార్యకర్తల దూకుడు ఎక్కువగానే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు కార్యకర్తల కారణంగా.. ఇబ్బందులు వస్తాయి. వాటిని నియంత్రించే బాధ్యత పార్టీ నాయకుల పైన అధిష్టానం పెద్దలపైనే ఉంటుంది. కానీ..వైసీపీలో ఆ తరహా పరిస్థితి కనిపించడం లేదు. దీనివల్లే.. జగన్ ఎక్కడికి వెళ్లినా.. రప్పా-రప్పా పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇది మైనస్‌గా మారుతోంది.
2) జగన్ వ్యవహారం: జగన్ వ్యవహార శైలిలోపెద్దగా మార్పు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పరంగా మార్పులు-చేర్పుల దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ, ఇదేమీ జగన్‌లో కనిపించడం లేదని పార్టీ నాయకులే చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన స్క్రిప్టులు చదువుతూ కూడా తడబడుతుండడం, పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడం వంటివి కూడా పార్టీని వ్యతిరేకత దిశలోనే నడిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
3) సానుభూతి: ఇక, ప్రజల్లో పెద్దగా పార్టీ విషయంలో సానుభూతి కనిపించడంలేదు. ఒక పార్టీ ఓడినా.. లేక 11 స్థానాలకు పరిమితమైనా.. వెంటనే ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఈ విషయంలోనూ వైసీపీ వెనుకబడే ఉంది. మరోవైపు మధ్యతరగతి వర్గంలో ఆనాటి వ్యతిరేకత.. వైసీపీ విషయంలో వేసుకున్న స్థిరమైన అం చనాలు వంటివి పదిలంగానే ఉన్నాయి. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా..వైసీపీకి ఆశించిన మేరకు ఫలితం అయ్యేదక్కే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.
