Begin typing your search above and press return to search.

చదువుకోండి ఫస్టు... ఎక్కువ కాలం బ్రతికేయొచ్చు!

ఈ క్రమంలో విద్యనభ్యసించిన ప్రతీ అదనపు సంవత్సరమూ మరణాలను 2% తగ్గించిందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 11:30 PM GMT
చదువుకోండి ఫస్టు...  ఎక్కువ కాలం బ్రతికేయొచ్చు!
X

ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఎక్కువ నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం వంటివి ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడతాయనేది తెలిసిన విషయమే! అయితే... కేవలం ఇవే కాదు.. ప్రతీ ఒక్కరూ మరిచిపోకూడని మరో ఆరోగ్యకరమైన అలవాటు కూడా ఉందని.. అది విద్యను పొందడం అని అంటున్నారు పరిశోధకులు. విద్యను పొందడం వల్ల మనిషి ఎక్కువకాలం జీవించడానికి అవసరమైన ఒక ఆరోగ్యకరమైన అలవాటని అంటున్నారు.

అవును... సుమారు 59 దేశాల్లోని వందలాది మంది వ్యక్తుల అధ్యయనాల నుండి తీసిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేతాలు... ప్రజలు ఎన్ని సంవత్సరాలపాటు విద్యను పోందారు, మరణాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. దీంతో... ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా... తక్కువ పాఠశాల విద్య ఉన్నవారు.. ఎక్కువ విధ్యను అభ్యసించినవారికంటే మూందు చనిపోతారని తేలిందంట.

ఈ క్రమంలో విద్యనభ్యసించిన ప్రతీ అదనపు సంవత్సరమూ మరణాలను 2% తగ్గించిందని చెబుతున్నారు. అంటే... కాలేజీ విద్య పూర్తి చేసిన వారితో పోలిస్తే.. పాఠశాల విద్యను పూర్తి చేయని వారు ముందుగానే చనిపోయే ప్రమాదం 34% ఎక్కువగా ఉంటుందట! ఈ సమయంలో... "విద్య యొక్క ప్రభావం.. ఆహారం, ధూమపానం, అధిక మద్యపానం వంటి కొన్ని పెద్ద ఆరోగ్య కారకాలతో పోల్చదగినదిగా కనిపిస్తోంది" అని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇదే సమయంలో పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు గడిపితే అంత మంచిదని.. మరణాల ప్రమాదాన్ని తగ్గించడంలో విద్య కూడా కీలక భూమిక పోషిస్తున్నట్లు కనిపిస్తోందని.. అందువల్ల విద్య చాలా ముఖ్యమైనదని చెబుతున్నారు. ఇదే సమయంలో ఉన్నత విద్య - తగ్గిన మరణాల మధ్య సంబంధం చాలా సార్వత్రికమని వారు కనుగొన్నారట. ఇదే క్రమంలో... అన్ని వయసుల వారికీ విద్య ముఖ్యమైనదని తాము కనుగొన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అందుకే... ఎక్కువకాలం బ్రతకాలంటే... ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఎక్కువ సమయం నిద్రపోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంత ముఖ్యమో... ఉన్నత విద్య కూడా అంతే ముఖ్యమన్నమాట! అందుకే... చదువుకోండి ఫస్టు.. తర్వాత ఎక్కువకాలం బ్రతికేయొచ్చు!!