Begin typing your search above and press return to search.

టీటీడీ దగ్గరి రూ.2వేల నోట్లకు ఆర్ బీఐ ఓకే!

వీటిని మార్పిడి చేసుకునేందుకు టీటీడీ ప్రయత్నించగా ఫలితం లేకపోయింది.

By:  Tupaki Desk   |   26 April 2024 5:16 AM GMT
టీటీడీ దగ్గరి రూ.2వేల నోట్లకు ఆర్ బీఐ ఓకే!
X

పెద్ద నోట్ల రద్దు.. అనంతరం తెర మీదకు వచ్చిన అతి పెద్ద నోటు రూ.2వేల రాజసం.. ఆ తర్వాతి కాలంలో దాన్ని సైతం వెనక్కి ఇచ్చేయాలంటూ భారీ ప్రణాళికను రూపొందించి.. దేశంలోని రూ.2వేలనోట్లను వెనక్కి తీసుకునే కార్యక్రమం గురించి తెలిసిందే. దేశ ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోటును బ్యాంకులకు తిరిగి ఇచ్చేసి.. అందుకు సరిపడా మొత్తాన్ని తీసుకోవటం తెలిసిందే. అయితే.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో భక్తులు పెద్ద ఎత్తున రూ.2వేల నోట్లను వేశారు.

వీటిని మార్పిడి చేసుకునేందుకు టీటీడీ ప్రయత్నించగా ఫలితం లేకపోయింది. 2023 అక్టోబరు 7 నుంచి రూ.2వేల నోట్ల మార్పిడిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. గడువు తీరిన తర్వాత కూడా శ్రీవారి హుండీల్లో జమ అవుతున్న రూ.2వేల నోట్లను మార్చుకునే ప్రయత్నం చేయగా.. ఇప్పటివరకు ఆర్ బీఐ సానుకూలంగా స్పందించలేదు. ఇలాంటివేళ.. తాజాగా టీటీడీ అధికారులు రిజర్వు బ్యాంకు ఇండియాను మరోసారి సంప్రదించారు. స్వామివారికి హుండీలో కానుకగా వేసిన రూ.2వేల నోట్లను తీసుకోవాలని విన్నవించుకున్నారు.

గతంలో ఈ తరహా ప్రపోజల్ కు నో చెప్పిన ఆర్ బీఐ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా సానుకూలంగా స్పందించింది. దీంతో గత ఏడాది అక్టోబరు 8 నుంచి ఈ ఏడాది మార్చి 22 వరకు ఐదు విడతల్లో రూ.3.20 కోట్ల మొత్తాన్ని మార్చేసింది. అయితే.. 2016లో పెద్ద నోట్ల రద్దు వేళలో మాత్రం టీటీడీ వద్ద పోగైన సుమారు రూ.50 కోట్ల మొత్తాన్ని రిజర్వు బ్యాంకును మార్చుకోవటానికి వీలుగా అనుమతించలేదు.తాజాగా మాత్రం ఓకే చెప్పటంపై టీటీడీ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.