ఏపీలో 'రేమండ్స్' రెపరెపలు..
ప్రపంచ ప్రసిద్ధ సింఘానియా గ్రూపునకు చెందిన రేమండ్స్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 24 Jun 2025 11:00 AM ISTప్రపంచ ప్రసిద్ధ సింఘానియా గ్రూపునకు చెందిన రేమండ్స్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మారిన పాలన.. పెట్టుబడులకు అనుకూల అవకాశాలు ఉండడంతో రేమండ్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 1200 కోట్ల రూపాయలకుపైగానే పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారీకీ ప్రాధాన్యం కల్పించేలా 18 సంస్థలను ఏర్పాటు చేయనున్నట్టు రేమాండ్స్ ప్రకటించింది. సీఎం చంద్రబాబు తమను సంప్రదించారని.. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చామని తెలిపింది.
ఏం చేస్తారు?
రేమాండ్స్..అనేది దుస్తులకు ప్రధాన బ్రాండ్. రేమాండ్స్ ఉన్నత వర్గాల నుంచి మధ్యతరగతి వర్గాల ప్రజల వరకు కూడా దుస్తుల ను అందిస్తుంది. రెడీ మేడ్ దుస్తుల నుంచి వస్త్రాల వరకు ఈ సంస్థకు మంచి పేరుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని.. ఈ ఏడాది జనవరిలో సింఘానియా బృందాన్ని అమరావతికి ఆహ్వానించిన చంద్రబాబు వారికి ఇక్కడ ఉన్న అవకాశాలను వివరిం చారు. నాణ్యమైన పట్టు, పత్తి వంటివి ఇక్కడ లభిస్తాయని.. చేనేతకు మంగళగిరి ప్రసిద్ధమని పేర్కొన్నారు. చేనేత కార్మికులు కూడా ఎక్కువగా ఉన్నారు. దీంతో వారికి కూడా అవకాశం లభిస్తుందని వివరించారు. దీనికి సింఘానియా తాజాగా పచ్చ జెండా ఊపింది.
ఉపాధి అవకాశం..
చేనేత రంగానికి చెందిన కార్మికులకు.. రేమండ్స్ సంస్థ ద్వారానే నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇప్పించనున్నారు. అంతేకాదు.. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్త్రాలను రేమాండ్స్ నైపుణ్యాలు, నాణ్యతకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. తద్వారా రేమాండ్స్ షోరూముల్లో వాటిని విక్రయించేందుకు అవకాశం మార్కెటింగ్‌కు సదుపాయాలుకల్పిస్తారు. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ఉద్యోగాలు, ఉపాధి కూడా లభించనుందని ఈ ఏడాది జనవరిలో జరిగిన చర్చల్లో చంద్రబాబుపేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేమాండ్స్ సంస్థ దీనికి అంగీకారం తెలుపుతూ.. రాష్ట్ర సర్కారుకు సమాచారం అందించింది. షోరూములు, వస్త్రాల తయారీ.. నైపుణ్య శిక్షణ వంటి వాటిలో 1200 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టనున్నారు.
