Begin typing your search above and press return to search.

మాదాపూర్ లో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో సినీ నిర్మాత?

నగరం నడిబొడ్డుగా మారిన మాదాపూర్ లో రేవ్ పార్టీ నిర్వహించటం ద్వారా బరితెగింపును ప్రదర్శించారు కొందరు పెద్ద మనుషులు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 3:58 AM GMT
మాదాపూర్ లో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో సినీ నిర్మాత?
X

కుర్రకారు చేసుకునే రేవ్ పార్టీ గురించి విని ఉంటాం. హైదరాబాద్ మహానగర శివారులో గుట్టుచప్పుడు కాకుండా ఫామ్ హౌస్ లో జరిగే ఈ తరహా పార్టీలను పోలీసులు భగ్నం చేస్తూ.. పలువురిని అదుపులోకి తీసుకునే వార్తల్ని అప్పుడప్పుడు చదువుతుంటాం. అలాంటిది.. నగరం నడిబొడ్డుగా మారిన మాదాపూర్ లో రేవ్ పార్టీ నిర్వహించటం ద్వారా బరితెగింపును ప్రదర్శించారు కొందరు పెద్ద మనుషులు.

మాదాపూర్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. పకడ్బందీగా వ్యవహరిస్తూ.. ఆ పార్టీని భగ్నం చేసినట్లుగా చెబుతున్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడుల నేపథ్యంలో.. ఈ వ్యవహారం హైప్రొఫైల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దాడుల సందర్భంగా పోలీసులు భారీగా మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాల్ని అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. పోలీసుల అదుపులో ఒక సినీ నిర్మాతతో సహా ఐదుగురు ప్రముఖులు ఉన్నట్లుగా చెబుతున్నారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో ప్రముఖులు ఉండటంతో.. బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఎల్ ఎస్ డీ పట్టుబడినట్లుగా తెలుస్తోంది. అయితే.. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.