Begin typing your search above and press return to search.

డీప్ ఫేక్ వ్య‌క్తి అరెస్ట్..అత‌ను ఇత‌డే

ర‌ష్మిక మంద‌న్నా డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. సెల‌బ్రిటీల‌కు సంబంధించి అదే తొలి వీడియో కావ‌డంతో చాలా మంది సెలబ్రిటీలంతా పెద్ద ఎత్తున స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 11:27 AM GMT
డీప్ ఫేక్ వ్య‌క్తి అరెస్ట్..అత‌ను ఇత‌డే
X

ర‌ష్మిక మంద‌న్నా డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. సెల‌బ్రిటీల‌కు సంబంధించి అదే తొలి వీడియో కావ‌డంతో చాలా మంది సెలబ్రిటీలంతా పెద్ద ఎత్తున స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. నిందుతుల్ని క‌ఠ‌నింగా శిక్షించాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఆ వీడియో త‌ర్వాత మ‌రికొంత మంది సెల‌బ్రిటీలు డీప్ ఫేక్ బారిన ప‌డ్డారు. మరోవైపు వివిధ సైబ‌ర్ క్రైమ్ లో పోలీస్ కేసులు న‌మోదయ్యాయి.

ఇలాగే వ‌దిలేస్తే మ‌రింత మంది సెల‌బ్రిటీలు డీప్ ఫేక్ బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని తేలిపోయింది. దీంతో పోలీసులు కేసును స‌వాల్ గా తీసుకుని ముందుకెళ్లారు. తాజాగా ఆ డీప్ ఫేక్ దుండ‌గుడు ఎవ‌రో తెలిసి పోయింది. ఎట్ట‌కేల‌కు ఢిల్లీ పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం అత‌డు పోలీసులు అదుపులో ఉన్న‌ట్లు...అత‌న్ని విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డి వివ‌రాలన్నింటిని గోప్యంగా ఉంచారు .

ఎక్క‌డా లీక్ అవ్వ‌కుండా పోలీసులు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి అత‌గాడి వివ‌రాలు గోప్యంగా ఉంచుతారా? మీడియా ముందు ప్ర‌వేశ పెడ‌తారా? అన్న‌ది చూడాలి. ఈ కేసు విష యంలో కొన్ని ఆధారాలు లభించిన‌ట్లు ఢిల్లీ పోలీసులు గ‌తంలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. వాటి ఆధారంగానే ఆ వ్య‌క్తిని రెక్కీ వేసి ప‌ట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. టెక్నిక‌ల్ డేటాతో ఆ వీడియో ఎక్క‌డ అప్ లోడ్ చేసారు? దాని ఐపీ అడ్ర‌స్ లు ఏంటి? క‌నుక్కుని ప‌క్కా ఆధారాల‌తో అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ర‌ష్మిక త‌ర్వాత మ‌రికొంత మంది సెలబ్రిటీలు కూడా డీప్ ఫేక్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. మరి ఆ న‌టీనటుల వీడియోల వెనుక అరెస్ట్ అయిన వ్య‌క్తి ఉన్నాడా? అత‌నే ఇవ‌న్నీ చేస్తున్నాడా? వాటిలో అత‌డి ప్రేమేయం ఏదైనా ఉందా? లేక కొత్త వాళ్లు ఎవ‌రైనా ఉన్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.