Begin typing your search above and press return to search.

బీజేపీతో సమస్య ఉంటే నాతో వాదన ఎందుకు.. రష్మి చురక

సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత సమకాలీన అంశాలపై అప్పుడప్పడుు స్పందిస్తున్నారు కొందరు సెలబ్రీటీలు

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:57 AM GMT
బీజేపీతో సమస్య ఉంటే నాతో వాదన ఎందుకు.. రష్మి చురక
X

సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత సమకాలీన అంశాలపై అప్పుడప్పడుు స్పందిస్తున్నారు కొందరు సెలబ్రీటీలు. నిజానికి తమిళనాడుతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు సామాజిక అంశాల మీదా.. రాజకీయ అంశాల మీదా స్పందించే వైనం తక్కువగా ఉండటం తెలిసిందే. అయితే.. కొందరు ఇందుకు మినహాయింపుగా చెప్పాలి. అనవసరమైన రచ్చకు వెళ్లకుండా.. సింఫుల్ గా.. సూటిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసే ధోరణి కొందరు సెలబ్రిటీల్లో కనిపిస్తుంటుంది. ఆకోవలోకే వస్తారు బుల్లితెర టాప్ సెలబ్రీటీల్లో ఒకరు రష్మి గౌతమ్.

తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారిన వైనం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు స్పందించటం.. దానిపై జోరు వాదనలు సాగుతున్నాయి. ఇలాంటివేళ.. ఈ అంశంపై జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ''నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. అలా విమర్శిస్తున్నారంటే మీ ఎజెండాలు వేరే ఉన్నాయి'' అంటూ చేసిన ప్రసంగ వీడియోకు రష్మి స్పందిస్తూ.. హార్ట్ హ్యాండ్స్ ఎమోజీని జోడించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. ఎమోజీ తప్పించి ఎలాంటి కామెంట్ చేయలేదు రష్మి. అయితే.. ఆమె రియాక్షన్ పై ఒక నెటిజన్ ప్రశ్నించారు. 'డియర్ రష్మి.. మీ ధర్మంతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. ఆ పేరుతో బీజేపీ ఎన్నో నేరాలు చేస్తోంది. మతం పేరుతో అమాయకుల ప్రాణాల్ని బలితీసుకుంటుంది. మణిపూర్ ఘటనల్ని ఒకసారి పరిశీలించండి'' అని పేర్కొన్నారు. దీంతో ట్వీట్ల వార్ సాగింది.

సదరు నెటిజన్ ట్వీట్లపై రష్మి చురకలు వేశారు. నీకు బీజేపీతో సమస్య ఉంటే నాతో ఎందుకు వాదనకు దిగుతావు అని ప్రశ్నించారు. నెటిజన్ ట్వీట్ చేయటం.. దానికి రష్మి రిప్లై ఇవ్వటం.. దానిపై జరిగిన వాదనలో తనను తప్పు పట్టిన వ్యక్తికి చురుకు పుట్టేలా రిప్లై ఇచ్చిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.