Begin typing your search above and press return to search.

ప్రపంచంలో 21వ లైగర్ 'గొలియత్' ను చూశారా?

అవును... సుమారు నెల రోజుల క్రితం రుమేనియాలోని ఓ ప్రైవేటు జూలో లైగర్ జన్మించింది.

By:  Tupaki Desk   |   22 July 2025 8:28 AM IST
ప్రపంచంలో 21వ లైగర్  గొలియత్ ను చూశారా?
X

రొమేనియా తూర్పు ప్రాంతంలోని సుశీవాలో ఉన్న ప్రైవేటు జూలో లైగర్‌ జన్మించింది. మగ సింహం, ఆడ పులి సంభోగంతో ఇది జన్మిస్తుంది. ప్రపంచంలో ఇప్పటిదాకా ఇవి 20 వరకూ మాత్రమే ఉన్నాయని జూ అధికారులు చెబుతున్నారు. అవి అత్యంత అరుదైనవని అన్నారు. ఈ సమయంలో మగ లైగర్‌ పిల్ల జన్మించిందని, దానికి 'గొలియత్' అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.

అవును... సుమారు నెల రోజుల క్రితం రుమేనియాలోని ఓ ప్రైవేటు జూలో లైగర్ జన్మించింది. అయితే... ఇన్ని రోజుల తర్వాత దానిని తొలిసారిగా బయటి ప్రపంచానికి చూపించారు. ఈ సందర్భంగా స్పందించిన జూ యజమాని డొరిన్ సోయిమారు ద్పకి... లైగర్స్ ప్రజలకు బాగా నచ్చాయని విన్న తర్వాత, ఈ హైబ్రిడ్ జాతులను ఉత్పత్తి చేయడానికి తాను సిద్ధపడ్డట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... లైగర్ తల్లి తన పిల్లలను చూసుకోకపోవడంతో 'గోలియత్‌'కు ప్రత్యేక పొడి పాలు, కోళ్లను తినిపిస్తున్నట్లు తెలిపారు. ఈ మగ లైగర్ కంటే ముందు పుట్టిన ఓ ఆడ లైగర్ బ్రతకలేదని వివరించారు. ఈ జూలో ప్రస్తుతం మూడు సింహాలు, నాలుగు పులులు, అనేక పక్షులు సహా మొత్తం 570 జంతువులు ఉన్నట్లు చెబుతున్నారు.

వాస్తవానికి సింహం 250 కిలోల వరకే ఉంటాయని చెబుతున్న అధికారులు.. లైగర్‌ మాత్రం 400 కేజీల వరకూ బరువు పెరుగుతుందని తెలిపారు. ఇవి చాలా పెద్దగా ఉంటాయని.. స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టపడతాయని చెబుతున్నారు. అమెరికాలో నివసించే లైగర్ హెర్క్యులస్ 418 కిలోగ్రాముల బరువు కలిగి.. అతిపెద్ద పిల్లి జాతిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ లో చోటు సంపాదించింది!