Begin typing your search above and press return to search.

గుండె కింద గుచ్చుకున్న చేపముల్లు.. క్లిష్టమైన సర్జరీ సక్సెస్

గత నెల 25న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన 54 ఏళ్ల జంగాయమ్మ చేపలకూరతో భోజనం చేస్తూ.. పొరపాటున చేపముల్లును మింగారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 10:48 AM IST
గుండె కింద గుచ్చుకున్న చేపముల్లు.. క్లిష్టమైన సర్జరీ సక్సెస్
X

అరుదైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు కాకినాడ వైద్యులు. గుండె కింద భాగంలో గుచ్చుకున్న చేపముల్లును అత్యంత చాకచక్యంగా బయటకు తీసిన వైనం ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి శస్త్రచికిత్స నిర్వహించటం ఇదే తొలిసారి. తేవార్ పద్దతిలో చేపముల్లును తొలగించిన తీరును వైద్యులు వివరించారు. అసలేం జరిగిందంటే..

గత నెల 25న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన 54 ఏళ్ల జంగాయమ్మ చేపలకూరతో భోజనం చేస్తూ.. పొరపాటున చేపముల్లును మింగారు. ఆ తర్వాతి నుంచి ఛాతీ భాగంలో తీవ్రంగా నొప్పులకు గురయ్యారు. దీంతో కాకినాడ అపోలో ఆసుపత్రికి వెళ్లి చూపించగా.. సిటీ స్కాన్ నిర్వహించారు. అందులో సుమారు 4 సెంటీమీటర్ల పొడవు ఉన్న చేపముల్లు అన్నవాహిక నుంచి చొచ్చుకుపోయి గుండె పక్కనే ఉన్న పెద్ద రక్తనాళానికి గుచ్చుకున్నట్లుగా గుర్తించారు.

ఇలాంటి సమయంలో ఛాతి వద్ద కోసి సర్జరీ చేస్తారు. కానీ..ఇందుకు పన్నెండు గంటల సమయం పడుతుంది. అందులోకి ఇది క్లిష్టమైన ప్రక్రియ కావటంతో.. అందుకు భిన్నంగా బాధితురాలి తొడ వద్ద రంధ్రం చేసి చేపముల్లును విజయవంతంగా వెలికి తీశారు. ఈ తరహా సర్జరీ తెలుగు రాష్ట్రాల్లో మొదటిది కాగా.. దేశంలో ఇది రెండోది కావటం గమనార్హం. ఇంత కష్టమైన సర్జరీకి కేవలం రెండు కుట్లు పడేలా చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు.. చేపకూర ఎంత పని చేసిందంటూ చర్చించుకున్నారు.