Begin typing your search above and press return to search.

మై టీడీపీ - మై యాప్‌: ప‌రిటాల జోరు ..!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున కీల‌క కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

By:  Garuda Media   |   25 Feb 2026 6:00 AM IST
మై టీడీపీ - మై యాప్‌: ప‌రిటాల జోరు ..!
X

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున కీల‌క కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. `మైటీడీపీ-మై యాప్‌` పేరుతో ప్ర‌జ‌ల‌కు పార్టీని, ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కూడా చేరువ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌, ఆమెకుమారుడు, పార్టీ యువ నాయ‌కుడు శ్రీరాం ప్ర‌య‌త్ని స్తున్నారు. ఈ యాప్‌ను తాజాగా ఆవిష్క‌రించారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఈ యాప్ ద్వారా త‌మ దృష్టి కి తీసుకురావాల‌ని.. వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీత హామీ ఇచ్చారు.

ముఖ్యంగా యువ‌త‌ను, చ‌దువుకున్న వారిని సెంట్రిక్‌గా చేసుకుని ఈ యాప్‌ను తీసుకురావ‌డం గ‌మ‌నా ర్హం. గ‌త 20 మాసాల కాలంలో యువ‌త‌తో ఎక్కువ‌గా భేటీలు నిర్వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గంగా కూడా రాప్తా డు గుర్తింపు తెచ్చుకుంది. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను యువ‌త‌కు వివ‌రించ‌డంతోపాటు.. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ కాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంలోనూ యువ‌త‌ను తీర్చిదిద్దుతున్నారు. త‌ద్వారా వ‌చ్చే ఎన్నిక ల నాటికి యువ‌త‌ను మ‌రింత ఎక్కువ‌గా ఎంగేజ్ చేయాల‌న్న ల‌క్ష్యంతో అడుగులు వేస్తున్నారు.

యాప్ ఏం చేస్తుంది.. ?

తాజాగా అమ‌లులోకి తీసుకువ‌చ్చిన `మై టీడీపీ` యాప్ ద్వారా.. స్థానిక స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. అదేవిధంగా ప్రతి నెలా 1వ తేదీన ఇచ్చే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను రియ‌ల్ టైమ్‌లో ప‌ర్య‌వేక్షించ‌ను న్నారు. త‌ద్వారా ఎవ‌రికైనా స‌మ‌యానికి పింఛ‌న్లు అంద‌ని ప‌క్షంలో వారికి సత్వ‌ర‌మే అందేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. అలాగే.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను కూడా యాప్‌లోనే పోస్టు చేస్తారు. యువ‌త పార్టీసిపేష‌న్‌, వారి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం..!

వ‌చ్చే 2029 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ఎమ్మెల్యే సునీత పోటీ నుంచి త‌ప్పుకోనున్నారు. దీనికి సంబంధించిన నిర్ణ‌యం కూడా దాదాపు జ‌రిగిపోయింద‌ని అంటున్నారు. సో.. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ నాయ‌కుడు శ్రీరాం ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. ఇప్ప‌టి నుంచే పార్టీ ప‌రంగానే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా.. శ్రీరాం పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మైటీడీపీ-మై యాప్ పేరుతో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.