Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు పాకిన రప్ప‌.. రప్ప పాలిటిక్స్.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షురూ అయిన “రప్ప రప్ప” సంచలనం ఇప్పుడు తెలంగాణ రాజకీయ రంగానికి కూడా పాకింది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 7:59 AM
తెలంగాణ‌కు పాకిన రప్ప‌.. రప్ప పాలిటిక్స్.
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షురూ అయిన “రప్ప రప్ప” సంచలనం ఇప్పుడు తెలంగాణ రాజకీయ రంగానికి కూడా పాకింది. పుష్ప సినిమాలో ఈ డైలాగ్ వినిపించినా, జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తన ప్రెస్ మీట్ లో ఈ మాటను వినిపించడంతో ఇది సరికొత్త హైప్ తెచ్చుకుంది. ఇప్పుడీ 'రప్ప రప్ప' డైలాగ్ బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తల నోటి నుంచి కూడా వినిపిస్తోంది.

తెలంగాణలో జరిగిన బీఆర్‌ఎస్ మహాధర్నా సందర్భంగా సంగారెడ్డిలో “2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్...” అనే ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ ఫ్లెక్సీలపై హరీష్ రావు చిత్రాలు ఉండటం గమనార్హం. పటాన్‌చెరులోని రైతు ధర్నాలోనూ ఇదే డైలాగ్‌ను ఉపయోగిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో 'రప్ప రప్ప' డైలాగ్ ఇప్పుడు పార్టీ, రాష్ట్ర పరిమితులు దాటి ప్ర‌త్యేక క్రేజ్‌ను తెచ్చుకుంది. పుష్ప సినిమాలో అయితే ఈ మాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానీ నిజమైన హైప్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన తరువాతే వచ్చిందని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలపై విమర్శిస్తూ “రప్ప రప్పా... నరుకుతానంటున్నారు...” అని జగన్ వ్యాఖ్యానించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఈ డైలాగ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు “2028లో రప్ప రప్ప 3.0” అంటూ హరీష్ రావు నేతృత్వంలో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న సంకేతంగా దీనిని వినిపిస్తున్నారు.

ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, వాట్సాప్ స్టేటస్‌లు, మిమ్స్‌లో పెద్దగా చక్కర్లు కొడుతోంది. ఇకపై తెలంగాణలోనూ “రప్ప రప్ప” సెంటిమెంట్ మరింత రాజకీయం కానుంది అనడంలో సందేహం లేదు.

ఈ నేప‌థ్యంలో 2028 ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ 'రప్ప రప్ప' డైలాగ్ బీఆర్ఎస్ క్యాంపులోనూ, ప‌రిశ్ర‌మ‌ల‌లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ హవా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి రప్ప రప్ప డైలాగ్.. సినిమాలు, రాజకీయాల మధ్య వారధిగా మారి, రెండు రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో కొత్త రంగులు నింపింది!