Begin typing your search above and press return to search.

పోర్న్ స్టార్‌తో రణ్వీర్ యాడ్.. పేలిపోయింది

కానీ సరైన సినిమాలు పడక, సోషల్ మీడియాలో తన యాక్ట్స్ కూడా జనాలను ఆకట్టుకోక ఈ మధ్య డౌన్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 1:42 PM GMT
పోర్న్ స్టార్‌తో రణ్వీర్ యాడ్.. పేలిపోయింది
X

ఈ మధ్య కొంచెం వెనుకబడ్డాడు కానీ.. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అంటే ఎంటర్టైన్మెంట్‌కు మారు పేరు. అతను చేసే సినిమాలే కాదు.. చేసే యాడ్స్, బయట తన చేష్టలు కూడా ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. కానీ సరైన సినిమాలు పడక, సోషల్ మీడియాలో తన యాక్ట్స్ కూడా జనాలను ఆకట్టుకోక ఈ మధ్య డౌన్ అయ్యాడు. ఐతే ఇప్పుడు ఒక సూపర్ ఎంటర్టైనింగ్ యాడ్‌తో అతను సోషల్ మీడియాలో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. బోల్డ్ కేర్ అనే సెక్సువల్ ప్రాడక్ట్స్ అమ్మే సంస్థ కోసం అతను చేసిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ కోసం అతను ప్రముఖ పోర్న్ స్టార్ జానీ సిన్స్‌తో జత కట్టడం విశేషం.


హిందీ సీరియళ్లలో ఓవర్ డ్రమటిగ్గా అనిపించే సన్నివేశాల స్ఫూర్తితో ఈ యాడ్ రూపొందించడం గమనార్హం. జానీ సిన్స్‌ను బెడ్ మీద సామర్థ్యం లేనివాడిగా చూపిస్తూ.. అతడి భార్య తన నుంచి విడిపోవడానికి సిద్ధపడితే.. బోల్డ్ కేర్‌కు సంబంధించి ప్రాడక్ట్ వాడి అతను సెక్స్ సామర్థ్యం పెంచుకుని తన సంసారాన్ని చక్కదిద్దుకునే వైనాన్ని ఇందులో హిలేరియస్‌గా చూపించారు. జానీ సిన్స్ అనగానే సోషల్ మీడియా జనాల్లో నవ్వు పులుముకుంటుంది. అతణ్ని పెట్టి దేశీ స్టయిల్లో యాడ్ తీసి సెక్సువల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడం అన్నది క్రేజీ ఐడియా. ఇది ఆ ప్రాడక్ట్స్‌కు మంచి ప్రచారం తెప్పిస్తుందనడంలో సందేహం లేదు.