Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ట్రోల్స్‌.. అరిగిపోయిన రికార్డా?!

క‌ట్ చేస్తే.. తొలిసారి బీజేపీ అధ్య‌క్షుడి హోదాలో స్పందించిన రామ్‌చంద‌ర్ రావు.. లెక్క‌ల‌తో స‌హా విమ ర్శ‌లు గుప్పించినా.. ఆయ‌న ప్ర‌సంగాల‌కు పెద్ద‌గా మార్కులు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

By:  Tupaki Desk   |   6 July 2025 5:00 AM IST
తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ట్రోల్స్‌.. అరిగిపోయిన రికార్డా?!
X

ప్ర‌తిప‌క్షం చేసే విమ‌ర్శ‌ల‌కు ఒక లెక్క ఉండాల‌ని.. దానికొక ప‌క్కా వ్యూహం ఉండాల‌ని అనుకున్నారో ఏమో తెలియ‌దు కానీ.. తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ రామ‌చంద‌ర్‌రావు కాంగ్రెస్ స‌ర్కారుపై లెక్క‌ల‌తో స‌హా విరుచుకుప‌డ్డారు. 6-63-600 అంటూ.. కొత్త లెక్క‌లు తెర‌మీదికి తెచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి స‌ర్కారు ఏర్ప‌డి 600 రోజులు అయింద‌న్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు 6 గ్యారెంటీల‌ను ఇచ్చార‌ని.. కానీ, ఆరు వంద‌ల రోజులు అయినా.. స‌ర్కారు ఏమీ చేయ‌లేక పోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు.

అంతేకాదు.. 6 గ్యారెంటీల‌తోపాటు.. మ‌రో 63 అనుబంధ హామీల‌ను కూడా ఇచ్చార‌న్న రామ‌చంద‌ర్‌.. వీటి ని కూడా అమ‌లు చేయ‌లేక పోయార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో 100 రోజుల్లో నే 6 గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని హామీలు గుప్పించార‌ని అన్నారు. కానీ.. 600 రోజులు గ‌డిచి నా.. ఎవ‌రూ దీనిపై స్పందించ‌డం లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై తెలంగాణ స‌మాజం ఆగ్ర‌హంతో ఉంద‌న్నారు.

క‌ట్ చేస్తే.. తొలిసారి బీజేపీ అధ్య‌క్షుడి హోదాలో స్పందించిన రామ్‌చంద‌ర్ రావు.. లెక్క‌ల‌తో స‌హా విమ ర్శ‌లు గుప్పించినా.. ఆయ‌న ప్ర‌సంగాల‌కు పెద్ద‌గా మార్కులు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కొత్త‌గా ఏమీ లేద ని.. ఆయ‌న స్పందించాల్సింది వీటిపై కాద‌ని సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌చ్చాయి. బ‌న‌క‌చ‌ర్ల‌పై బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాల‌ని ఎక్కువ మంది ప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకువ చ్చిన నిధులు, ఇత‌ర అంశాల‌పై చ‌ర్చ పెడితే బాగుండేద‌న్నారు.

`అరిగిపోయిన రికార్డు` మాదిరిగా కాంగ్రెస్ గ్యారెంటీల‌పై ఇప్ప‌టికే అన్ని పార్టీలు మాట్లాడాయ‌ని చెబుతు న్నారు. మరీ ముఖ్యంగా బీసీ రిజ‌ర్వేష‌న్‌పై మీ స్టాండ్ ఏంట‌ని ఎక్కువ మంది ప్ర‌శ్నించారు. కొత్త నేత కొత్త‌గా మాట్లాడ‌తార‌ని ఎక్కువ‌గా ఊహించుకున్నామ‌ని కొంద‌రు పెదవి విరిచారు. ఇదీ రామ‌చంద‌ర్‌రావు.. బీజేపీ చీఫ్ హోదాలో చేసిన తొలి ప్రెస్‌మీట్‌పై ప‌బ్లిక్ టాక్‌.