Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి రమ్యక్రిష్ణ... సంచలన కామెంట్స్ చేసిన శివగామి

అలాంటి రమ్యక్రిష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారా. ఈ డౌట్ ఇపుడు అందరికీ కలుగుతోంది. ఎందుకంటే రమ్యక్రిష్ణ ఇటీవల ఏపీ మినిస్టర్ ఆర్కే రోజా ఇంట్లో సందడి చేశారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 3:31 PM GMT
రాజకీయాల్లోకి రమ్యక్రిష్ణ... సంచలన కామెంట్స్ చేసిన శివగామి
X

రమ్యక్రిష్ణ అంటేనే గ్లామర్ విత్ గ్రామర్ ఉన్న నటి అని అంతా ఒప్పుకుంటారు. ఒక నీలంబరి గా ఒక శివగామిగా ఆమెను తప్ప ఆ పాత్రలలో ఎవరినీ అసలు ఊహించుకోలేరు. యాభైల వయసు దాటినా ఇంకా గ్లామర్ ని అలాగే మెయింటెయిన్ చేస్తూ ఈ రోజున కూడా చేతినిండా సినిమాలు చేస్తూ తన నటనతో ఆకట్టుకుంటున్న రమ్యక్రిష్ణది సినీ ఫీల్డ్ లో మూడున్నర దశాబ్దాల హిస్టరీ.

అలాంటి రమ్యక్రిష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారా. ఈ డౌట్ ఇపుడు అందరికీ కలుగుతోంది. ఎందుకంటే రమ్యక్రిష్ణ ఇటీవల ఏపీ మినిస్టర్ ఆర్కే రోజా ఇంట్లో సందడి చేశారు. ఇద్దరూ భేటీ అయిన విషయం బయట తెగ వైరల్ అయింది. మరి ఈ ఇద్దరూ నిన్నటితరంలో వెండితెరను ఏలిన గ్లామరస్ హీరోయిన్స్. అందులో ఆర్కే రోజా మినిస్టర్ అయింది. మరి రమ్యక్రిష్ణకు కూడా పొలిటికల్ గా ఏమైనా ఇంటెరెస్ట్ ఉందా అన్నదే ఇపుడు కలుగుతున్న పెద్ద డౌట్.

దీని మీద ఒక చానల్ ఇంటర్వ్యూలో రమ్యక్రిష్ణ ఆసక్తికరమైన కామెంట్స్ నే చేశారు. నేనూ రోజా మంచి స్నేహితులం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉన్నాం, ఇద్దరం కలిస్తే ఎన్నో మాట్లాడుకుంటాం అందులో పెద్ద విశేషం వింతా లేదు అన్నారు. తాను ఇటీవల తిరుపతి వెళ్లినపుడు దర్శనం చక్కగా జరిగిందని, దానికి కారణం రోజా అని అన్నారు.

అందుకే ఆమెకు థాంక్స్ చెప్పేందుకు ఇంటికి వెళ్లాను అన్నారు. ఇక తామిద్దరం కలిస్తే మాట్లాడుకునేవి సినిమాలు రాజకీయాలు కానే కాదు అన్నారు. పిల్లలు ఎలా ఉన్నారు, ఏమి చేస్తున్నారు అని మాట్లాడుకుంటామని అన్నారు. ఇక పోతే రాజకీయాల్లోకి రావాలన్నది ఎవరికి వారిగా కోరిక ఉండాలని ఆమె అన్నారు. రోజాని చూసి తాను రావాలనుకోవడం మంచిది కాదని ఆమె చెప్పేశారు.

రోజాకు రాజకీయ అభిలాష ఉంది. దాని కోసం ఆమె మొదటి నుంచి చాలా కష్టపడ్డారు. ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారని ఆమె అన్నారు. ఇక తన వరకూ వస్తే ప్రస్తుతానికి రాజకీయాల మీద ఏమీ ఇంటరెస్ట్ లేదని కొట్టిపారేశారు రమ్యక్రిష్ణ. అయితే రెపటి రోజున ఏమి జరుగుతుందో అంటూ ఒక డౌట్ అయితే అలాగే ఉంచేశారు. అంటే భవిష్యత్తులో రమ్యక్రిష్ణ రాజకీయాల్లోకి వస్తారా అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.

ఏది ఏమైనా రమ్యక్రిష్ణ రాజకీయాలలోకి రావడం అంటూ జరిగితే అది హాట్ టాపికే అవుతుంది. ఎంతో మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన తమిళనాడుకు చెందిన వారు రమ్యక్రిష్ణ. ఆమె పాలిటిక్స్ లోకి వస్తానూ అంటే చేర్చుకునేందుకు క్యూ కట్టే పార్టీలు బోలెడు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. సో రమ్యక్రిష్ణ ఫ్యూచర్ మీద వదిలేసిన ఆ పాలిటిక్స్ మ్యాటర్ ఎపుడు కదులుతుందో ఏమో. అంతా వెయింటింగ్ మరి.