రామానాయుడు స్టూడియో మీద మరో సీరియస్ స్టెప్
విశాఖలో ఏకైక ఫిల్మ్ స్టూడియోగా రామానాయుడు స్టూడియో ఉంది. ఇది నిర్మాణం జరిగి కూడా రెండు దశాబ్దాలకు పైన అయింది.
By: Tupaki Desk | 6 April 2025 12:54 AM ISTవిశాఖలో ఏకైక ఫిల్మ్ స్టూడియోగా రామానాయుడు స్టూడియో ఉంది. ఇది నిర్మాణం జరిగి కూడా రెండు దశాబ్దాలకు పైన అయింది. మొత్తం 34 ఎకరాల భూమిని ఆనాడు ఈ స్టూడియో నిర్మాణానికి ఇచ్చారు అని అంటున్నారు. అయితే అందులో సగం మాత్రమే వినియోగించారు. మిగిలిన దానిని హౌసింగ్ పర్పస్ మీద వెంచర్లు వేయడానికి వైసీపీ అధికారంలో ఉండగా అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం జరిగింది. దాని మీద ఆనాడే టీడీపీ పోరాడింది.
ఇపుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ క్రమంలో 15.17 ఎకరాల భూములను ఎందుకు వెనక్కి తీసుకోరాదు అంటూ కూటమి ప్రభుత్వం స్టూడియో యాజమాన్యానికి నోటీసులు పంపించింది నిబంధనలకు విరుద్ధంగా హౌసింగ్ లే అవుట్ల కోసం అనుమతులు కోరారని చెబుతున్నారు. ఈ కారణం వల్లనే స్టూడియో భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని కూడా చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం రామానాయుడు భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మీదట విశాఖ జిల్లా కలెక్టర్ తాజాగా నోటీసులు జారీ చేయడంతో విషయం సీరియస్ గానే మారుతోంది. రామానాయుడు స్టూడియో యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా విశాఖ కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ నోటీసులకు రెండు వారాల లోగా వివరణ ఇవ్వాలని కోరుతామని ఆ మీదట తమ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన 34 ఎకరాలలో 15.17 ఎకరాల స్థలంలో హౌసింగ్ లే అవుట్ కోసం మార్పులు స్టూడియో యాజమాన్యం కోరింది. అయితే అది నిబంధనలకు విరుద్ధమని అందుకే నోటీసులు జారీ చేస్తున్నట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు.
ఇక చూస్తే కనుక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరికైనా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన పని కోసం భూమిని కేటాయించి నపుడు దానికి విరుద్ధంగా వారు వ్యవహరిస్తే ఆ భూ కేటాయింపులు రద్దు చేయవచ్చు అని ఉందని చెబుతున్నారు ఆ ప్రకారమే రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ సిసోడియా రామానాయుడు స్టూడియో అధినేతలకు నోటీసులు జారీ చేశారు అని చెబుతున్నారు.
అలా సిసోడియా ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ సీరియస్ యాక్షన్ దిశగా ముందుకు వచ్చారని అంటున్నారు. అయితే ఈ విషయంలో రామానాయుడు స్టూడియో అధినేతలు ఏ విధంగా స్పందించి జవాబు ఇస్తారు అన్న దాని మీదనే ఈ వ్యవహారం ఆధారపడి ఉందని అంటున్నారు. స్టూడియో విస్తరణకు ఆ భూమిని ఉపయోగించుకుంటామని చెబుతారా ఆ విధంగా నోటీసులో పేర్కొంటారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా విశాఖలో ఏకైక స్టూడియో ఇలా వివాదాల పాలు కావడం ఒకింత విషాదమే అని అంటున్నారు.
