Begin typing your search above and press return to search.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ...మోడీ స్మార్ట్ డెసిషన్ !

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఒక పేరు అయితే ఇపుడు ప్రచారంలోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   5 April 2025 12:50 PM IST
Ram Madhav Likely to Be Next BJP National President
X

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఒక పేరు అయితే ఇపుడు ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఎవరో కాదు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. మరీ ముఖ్యంగా ఏపీకి చెందిన వారు గోదావరి జిల్లా వాసి. ఆయనే వారణాసి రామ్ మాధవ్. ఆయనకే ఈ జాతీయ కిరీటం దక్కుతుంది అని ఢిల్లీలో వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.

ఇంతకీ వారణాసి రామ్ మాధవ్ స్పెషాలిటీ ఏంటి ఆయన ఎవరు అంటే చాలానే ఉంది. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారు. బీజేపీకి నిబద్ధతతో పనిచేసిన వారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2014లో బీజేపీ పీడీఎఫ్ ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు ఇక 2024లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లోనూ తనదైన శైలిలో పనిచేసి బీజేపీకి 29 సీట్లు రావడానికి కారణం అయ్యారు.

ఆయన 1981లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. అందులోనే సుదీర్ఘ కాలం పనిచేస్తూ 2014లో బీజేపీలో చేరి వివిధ హోదాలలో పనిచేశారు. వారణాసి రామ్ మాధవ్ ఉన్నత విద్యా వంతుడు. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు భారత దేశం మూలాలు ఎరిగిన వారు. ఆర్ఎస్ఎస్ కి ఆయన అత్యంత సన్నిహితుడు. ఏపీలోని అమలాపురం ఆయన సొంత ప్రాంతం.

ఇదిలా ఉంటే చాలా కాలం క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక చేపట్టాల్సి ఉంది. ఆర్ఎస్ఎస్ మాత్రం సంఘ్ కి చెందిన వ్యక్తికే పగ్గాలు అప్పగించాలని పట్టుబడుతోంది. జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా గత పది నెలలుగా కొత్త బాధ్యతలు మోస్తున్నారు దాంతో పూర్తి కాలం బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ కోసం ఎంతో అన్వేషణ సాగుతోంది

ఈసారి దక్షిణాదికే ఈ కీలక పదవి అన్న ప్రచారమూ సాగుతోంది. తెలంగాణాకు చెందిన జి కిషణ్ రెడ్డికి ఈ పదవి ఇస్తారని కొద్ది రోజుల నుంచి మరో ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఇపుడు అది కాస్తా ఏపీకి మళ్ళింది. వారణాసి రామ్ మాధవ్ పేరు దాదాపుగా ఖరారు అయింది అని అంటున్నారు.

వారణాసి రామ్ మాధవ్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఈ ఇద్దరికీ కూడా ఆయున అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. పనిగట్టుకుని మరీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికల్లో వారణాసి రామ్ మాధవ్ ని వారే అక్కడ ఎన్నికల సమయంలో పంపించారు. ఆయన సేవలను వాడుకున్నారు. ఆయన సమర్థతకు వారు మంచి మార్కులే వేశారు.

బీజేపీలో వారణాసి రామ్ మాధవ్ కి అత్యంత సన్నిహితులు ఎందరో ఉన్నారు. ఇక ఆయన పనితీరు ఎపుడూ ఆర్ఎస్ఎస్ పద్ధతిలోనే ఉంటుందని చెబుతారు ఆయన కరడు కట్టిన సంఘ్ మనిషి. అలాంటి వారే కావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటే ఇపుడు మోడీ సైతం ఆమోదముద్ర వేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇక ఆర్ఎస్ఎస్ చూస్తే బీజేపీ విజయాల వెనక వెన్నుదన్నుగా ఉంటూ వస్తోంది. హర్యాన, మహారాష్ట్ర, ఢిల్లీలలో బీజేపీ ఘన విజయాల వెనక ఆర్ఎస్ఎస్ ప్రణాళికాబద్ధమైన పనితీరు ఉంది. దేశంలో జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధపడుతుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆర్ ఎస్ ఎస్ సహకారం మరింత తప్పనిసరి అవుతోంది. దాంతో ఆర్ఎస్ఎస్ మనిషి అయిన వారణాసి రామ్ మాధవ్ పేరుని బీజేపీ పెద్దలు కూడా ఓకే చేస్తున్నారు అని అంటున్నారు.

మరో అయిదు నెలలలో బీహార్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ దాని కంటే ముందుగాన జాతీయ అధ్యక్షుడి ప్రకటనతో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటిస్తుందని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తొందరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని ఆ కొత్త అధ్యక్షుడిగా వారణాసి రామ్ మాధవ్ పేరు ఖరారు చేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది.