Begin typing your search above and press return to search.

రాజ్యసభకు బీజేపీ అభ్యర్థులు వీరే

ఎన్నికల నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 8న విడుదల చేయగా.. 15 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:30 AM GMT
రాజ్యసభకు బీజేపీ అభ్యర్థులు వీరే
X

పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మొత్తం 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో మూడు.. తెలంగాణలో మూడు స్థానాలకు చొప్పున ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా బీజేపీ తన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ఎన్నికల నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 8న విడుదల చేయగా.. 15 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. నామినేషన్ల పరిశీలనకు 16 వరకు గడువు ఉంది. విత్ డ్రా చేసేందుకు 20న ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాను చూస్తే.. అత్యధికంగా యూపీ నుంచి ఏడుగురిని.. బిహార్ నుంచి ఇద్దరిని.. హర్యానా.. కర్ణాటక.. ఉత్తరాఖండ్.. ఛత్తీస్ గఢ్.. పశ్చిమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరిని చొప్పున బీజేపీ ఎంపిక చేసింది.

ఇంతకు రాష్ట్రాల వారీగా అభ్యర్థులు ఎవరంటే..

ఉత్తరప్రదేశ్

- ఆర్ పీఎన్ సింగ్

- డాక్టర్ సుధాన్షు త్రివేది

- తేజ్ వీర్ సింగ్

- సాధనా సింగ్

- అమర్ పాల్ మౌర్యా

- డాక్టర్ సంగీత బల్వంత్

- నవీన్ జైన్

బిహార్ - ధర్మ్ శీల్ గుప్తా, డాక్టర్ భీం సింగ్

ఛత్తీస్ గఢ్ - దేవేంద్ర ప్రతాప్ సింగ్

హర్యానా - సుభాష్ బరాలా

కర్ణాటక - నారాయణ క్రష్ణాంశ

ఉత్తరాఖండ్ - మహేంద్ర భట్

పశ్చిమ బెంగాల్ - సామిక్ భట్టాచార్య