ఏపీలో మరో ఉప ఎన్నిక... షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కిన పరిస్థితి.
By: Tupaki Desk | 16 April 2025 9:53 AM ISTఆంధ్రప్రదేశ్ లో ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కిన పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా మరో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో.. మరో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఏపీలో మరో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా... వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఈ మేరకు రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ నెల 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు.
ఈ క్రమంలో ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉండగా.. మే 2 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇక.. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ క్రమంలో మొత్తంగా మే 13లోపు ఈ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది!
కాగా... వైసీపీకి విజయసాయిరెడ్డి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. తన రాజీనామా లేఖను ఏపీ మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్ కు పంపించారు. ఈ విషయాన్ని సాయిరెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఇదే సమయంలో.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ ను కలవడం, రాజీనామా లేఖను అందించడం.. వెంటనే ఛైర్మన్ అ లేఖను ఆమోదించడం జరిగిపోయాయి! ఈ నేపథ్యంలో.. ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
