నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇక, నామినేషన్లే!
దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో మరో మూడు మాసాల్లో ఖాళీ అవుతున్న మొత్తం 37 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
By: Garuda Media | 26 Feb 2026 10:50 PM ISTదేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో మరో మూడు మాసాల్లో ఖాళీ అవుతున్న మొత్తం 37 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. భారత ఎన్ని కల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభ మైంది. వచ్చేనెల(మార్చి)..5వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించా రు. మార్చి 6న నామినేషన్లను పరిశీలిస్తారు.
ఇక నామినేషన్ల ఉపసంహరణకు.. మార్చి నెల 9వ తేది వరకు అవకాశం ఉంటుంది. మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి... అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. వీటిలో ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందున్నాయి. తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాస్తవానికి ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో ఒకటి బీఆర్ ఎస్ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డికి చెందిన స్థానం.
మరొకటి.. కాంగ్రెస్ నేతకు చెందిన సీటు. ఈ రెండు కూడా వాస్తవానికి కాంగ్రెస్‌కే దక్కనున్నాయి. అయితే .. బీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా ఒక సీటును కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. కానీ, ఇది కేవలం కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టే ప్రక్రియేనని తెలుస్తోంది. ఎందుకంటే సంఖ్యాపరంగా అసెం బ్లీలో కాంగ్రెస్‌కే బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కే రెండు స్థానాలు దక్కనున్నాయి. అయినా.. రాజకీయంగా మాత్రం.. బీఆర్ ఎస్ తన వ్యూహాన్ని అమలు చేయనుంది.
తమిళనాడులో ఏకంగా 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన స్థానాలను అధికార పార్టీ డీఎంకే సొంతం చేసుకునే చాన్స్ కనిపిస్తోంది. ఇక, కర్ణాటక లో ఖాళీ అవుతున్న ఒక స్థానం.. తిరిగి అదే నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే దక్కనుంది. మొ త్తంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇక, పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.
