విల్లా & పేరెంట్స్.. రాజ్ తరుణ్ - లావణ్య కేసులో కొత్త ట్విస్ట్!
హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లు కనిపించగా.. తాజాగా అందులో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది.
By: Tupaki Desk | 17 April 2025 10:15 AM ISTసినిమా హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం తీవ్ర హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ట్విస్టుల అనంతరం అంతా సద్దుమణిగిందని చాలామంది అనుకున్నారు. ఈ సమయంలో హీరోకు సారీ చెప్పింది లావణ్య. ఇటీవల రాజ్ తరుణ్ కూడా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ సమయంలో విల్లా & హీరో పేరెంట్స్ అనే బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
అవును... హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లు కనిపించగా.. తాజాగా అందులో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా... ఈ సారి హీరో తల్లితండ్రులకు, లావణ్యకు మధ్య విల్లా విషయంలో గొడవ జరగడం గమనార్హం. ఈ సమయంలో అటు రాజ్ తరుణ్ పేరెంట్స్, ఇటు లావణ్య ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన రాజ్ తరుణ్ పేరెంట్స్... ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనని, తమ ఇంట్లోకి తమకు ఎంట్రీ లేకపోవడం ఏమిటని చెబుతోన్నారని అంటున్నారు. ఈ సమయంలో వారు విల్లా ముందు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో లావణ్యకు, రాజ్ తరుణ్ పేరెంట్స్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో లావణ్య.. నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది! ఈ సందర్భంగా రాజ్ తరుణ్ పేరెంట్స్ తనపై దాడి చేశారని ఆరోపించింది! తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి పదిహేను మందితో వచ్చి దాడి చేశారని.. ఆ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. తన తమ్ముడిని కొట్టారని, తలుపులు పగులగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది!
ఇదే సమయంలో... రాజ్ తరుణ్ తదనంతరం ఆ విల్లా తనకు చెందుతుందని, ఆ విధంగా హీరో వీలునామా రాశాడని లావణ్య చెబుతోంది! ఈ లోగా ఒకరి అనుమతి లేకుండా మరొకరు ఈ ఇంటిని అమ్మడానికి వీలేదనే కండిషన్ కూడా వీలునామాలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సమయంలో.. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కుమారుడిది అని రాజ్ తరుణ్ పేరంట్స్ చెబుతున్నారు. తమ కుమారుడి ఇల్లు ఉన్నాక తాము బయట ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఇదే సమయంలో.. ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు! దీంతో.. రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో రచ్చ తెరపైకొచ్చిందనే చర్చ మొదలైంది!
