Begin typing your search above and press return to search.

కొత్త లవ్ స్టోరీ.. ప్రేమించిన యువతితో భర్తను వదిలి వెళ్లిపోయింది!

వివరాళ్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ఝుంఝుంను జిల్లాలో గల మెయిన్ పురా గ్రామంలో ఇద్దరు మహిళలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 12:00 AM IST
కొత్త లవ్  స్టోరీ.. ప్రేమించిన యువతితో భర్తను వదిలి వెళ్లిపోయింది!
X

అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం సహజం, ప్రకృతి ధర్మం! ఇటీవల కాలంలో అబ్బాయిలు, అబ్బాయిలు.. అమ్మాయిలు, అమ్మాయిలు ప్రేమించుకుంటున్న సంఘటనలు అప్పుడప్పుడూ తెరపైకి వస్తున్నాయి. ఈ రెండో కోవకే చెందిన ఓ ప్రేమకథ రొటీన్ కి భిన్నంగా సాగిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది! భర్తను వదిలి మరీ ప్రేమించిన అమ్మాయితో భార్య జంప్ అయిపోయింది.

అవును... తాజాగా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ఝుంఝుంను జిల్లాలో గల మెయిన్ పురా గ్రామంలో ఇద్దరు మహిళలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు ఉద్యోగం కోసం వెళ్లిన వీరు సుమారు రెండు వారాలు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరిలో ఒక యువతికి ఇప్పటికే వివాహం కూడా అయ్యింది!

మెయిన్ పురా గ్రామానికి చెందిన అంజు (23), రేణు (25) కొన్ని నెలల క్రితం బంధువుల వివాహంలో కలుసుకున్నారు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిన వీరు.. తరచూ ఫోన్ లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. వారిద్దరూ వివాహం చేసుకొని, కలిసి జీవించాలనుకున్నారు. వీరిలో రేణుకి అప్పటికే వివాహం అయ్యింది.

అయినప్పటికీ ఆమె తన భర్తను, కుటుంబసభ్యులను వదిలి అంజుతో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రేణు కుటుంబీకులు 10 రోజుల క్రితం గోత్రా పోలీస్ స్టేషన్ లో తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అంజుతోనే కలిసి పారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు వారిని కనుగొన్నారు.. అయితే వారు ఇష్టపూర్వకంగానే కలిసి ఉండటంతో ఏమీ చేయలేకపోయారు!

ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... ఇద్దరు అమ్మాయిలు మేజర్ లని, ఇరువురూ ఇష్టప్రకారమే కలిసి జీవించాలనుకుంటున్నారని.. వీరి విషయంలో చట్టం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు!