Begin typing your search above and press return to search.

పీవోకే భారత్ లో విలీనం ఖాయం.. రాజ్ నాథ్ కీలక వ్యాఖ్య

మీ ఆస్తిని ఎవరైనా కాజేశారనుకుందాం. లేదంటే.. మీ భూమిని ఎవరైనా కబ్జా చేశారనుకుందాం.

By:  Tupaki Desk   |   25 March 2024 6:48 AM GMT
పీవోకే భారత్ లో విలీనం ఖాయం.. రాజ్ నాథ్ కీలక వ్యాఖ్య
X

మీ ఆస్తిని ఎవరైనా కాజేశారనుకుందాం. లేదంటే.. మీ భూమిని ఎవరైనా కబ్జా చేశారనుకుందాం. మీరేం చేస్తారు? సర్లేనని ఊరుకుంటారా? పోరాడతారా? భారత్ మీద యుద్ధానికి తెగబడి.. ఆ యుద్ధంలో భారత్ విజయం సాధించినప్పటికీ మన దేశానికి చెందిన భూమిని కోల్పోవటం ఏమిటి? దేశ చరిత్రను చదవి చిన్న పిల్లాడికి సైతం ఇదే సందేహం వస్తుంది. కారణం ఏమైనా.. గెలిచిన యుద్ధంలో.. మనదైన భూమిని కోల్పోవటం ఏమిటి? అప్పటి నుంచి ఇప్పటివరకు పాక్ ఆక్రమిత కశ్శీర్ ను సొంతం చేసుకోవటానికి కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపదన్న సంగతి తెలిసిందే.

ఓపక్క పాకిస్థాన్ కవ్విస్తూ.. దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ఆధారాలతో నిరూపితమైనా.. దానికి సరైన రీతిలో బుద్ధి చెప్పే ధైర్యం కాంగ్రెస్ కు చెందిన ఏ ప్రభుత్వం చేపట్టలేదనే చెప్పాలి. ఈ విషయంలో ఇందిరమ్మను మినహాయించాల్సిందే. దీనికి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో విలీనం అయ్యేలా చేయాలన్న ప్రతి భారతీయుడి ఆశకు.. ఆకాంక్షకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటుంది బీజేపీ.

కాంగ్రెస్ తీరుకు భిన్నంగా బీజేపీ అగ్రనేతలు అప్పడప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ మీద కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్య మరోసారిచేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. భారత్ లో విలీనం కావాలని పాక్ అక్రమిత కశ్మీర్ ప్రజల నుంచే ఎక్కువగా డిమాండ్లు వస్తున్నాయని వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి.. పీవోకే భారత్ లో విలీనం అవుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు.

జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. పాక్ ను ఉద్దేశించి రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘‘కశ్మీర్ ను వాళ్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా? పాక్ అక్రమిత కశ్శీర్ గురించి వాళ్లు ఆందోళన చెందాలి. అక్కడ దాడి చేసి అక్రమించుకునే అవసరం మనకు ఉండదని ఏడాదిన్నర క్రితమే చెప్పా. ఎందుకుంటే అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. భారత్ లో విలీనం కావాలని అక్కడి ప్రజలే కోరుకుంటున్నారు. వారిప్పుడు ఆ అంశాన్ని డిమాండ్ చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కీలకమైన ఎన్నికల వేళ పీవోకే మీద రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ.. ఈ అంశం మీద కాంగ్రెస్ స్టాండ్ ఏమిటి? పీవోకే గురించి ఆ పార్టీ మాట్లాడాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అంత ధైర్యం కాంగ్రెస్ చేస్తుందా? అన్నది అసలు ప్రశ్న.