ఎస్.సీ.ఓ.లో సభ్యదేశాలకు షాకిచ్చిన రాజ్ నాథ్ సింగ్.. కీలక నిర్ణయం!
చైనాలో 'షాంఘై సహకార సంస్థ' (ఎస్.సీ.ఓ) సదస్సులో పాల్గొన్నారు భారతదేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.
By: Tupaki Desk | 26 Jun 2025 8:26 AMచైనాలో 'షాంఘై సహకార సంస్థ' (ఎస్.సీ.ఓ) సదస్సులో పాల్గొన్నారు భారతదేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ సమావేశంలో.. ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా భారత్, పాక్ రక్షణ మంత్రులు ఎదురయ్యారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి రాజ్ నాథ్ కీలక ప్రసంగం చేశారు. అనంతరం ఓ షాకింగ్ పరిణామం నెలకొంది.
అవును... చైనా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్... ఎస్.సీ.ఓ సదస్సులో పాల్గొని.. పహల్గాం ఉగ్రదాడి, సీమాంతరం ఉగ్రవాదం గురించి కీలక ప్రసంగం చేశారు. ఈ సమావేశం అనంతరం దీనిపై జాయింట్ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు. అయితే.. ఆ డాక్యుమెంట్ లో ఎక్కడా పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ప్రస్థావన లేదు.
దీంతో... రాజ్ నాథ్ సింగ్ సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. ఇందులో భాగంగా.. పహల్గాం ఉగ్రదాడి ప్రస్థావన లేని ఆ జాయింట్ డాక్యుమెంట్ పై సంతకం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆ ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. ఇలా ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం అనంతరం ఆ సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది.
ఉగ్రవాదంపై భారత వైఖరిని నీరుగార్చేలా ఉన్నందువల్లే ఆ సమ్యుక్త ప్రకటన పత్రం పై సంతకం చేసేందుకు రాజ్ నాథ్ సింగ్ నిరాకరించారు. అయితే.. ఈ సదస్సుకు చైనా అధ్యక్షత వహిస్తోండటంతో పాకిస్థాన్ వల్లే ఈ జాయింట్ డాక్యుమెంట్ నుంచి పహల్గం ప్రస్తావనను మినహాయించి ఉంటారనే చర్చ నడుస్తోంది.
ఇక, ఈ సదస్సులో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడుకుంటున్నాయంటూ పరోక్షంగా పాకిస్థాన్ ను దుయ్యబట్టారు. ఇదే సమయంలో.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా... 2020లో గల్వార్ ఘర్షణ తర్వాత నుంచి భారతదేశ రక్షణశాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ ఆర్గనైజేషన్ లో భారత్, చైనా, పాకిస్థాన్ తో పాటు రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.