Begin typing your search above and press return to search.

గుంటూరు వెస్ట్ లో రజనీకి బాగా కలిసొస్తున్న అంశం ఇదేనా..?

అవును... నేతలు, ఎన్నికల ప్రచార విధానాలే కాదు.. ఓటర్లు కూడా బాగా అప్ డేట్ అయిన రోజులు ఇవి అని అంటున్నారు పరిశీలకులు.

By:  Tupaki Desk   |   29 April 2024 1:52 PM GMT
గుంటూరు వెస్ట్  లో రజనీకి బాగా కలిసొస్తున్న అంశం ఇదేనా..?
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... కేవలం ప్రచార కార్యక్రమాలే కాకుండా.. అత్యంత కీలక విషయాలపైనా నియోజకవర్గ ప్రజల మధ్య చర్చ జరుగుతుందని అంటున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ పాలనతో పాటు, నాటి మంత్రుల పనితీరు, స్థానిక ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు.

అవును... నేతలు, ఎన్నికల ప్రచార విధానాలే కాదు.. ఓటర్లు కూడా బాగా అప్ డేట్ అయిన రోజులు ఇవి అని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో... ప్రధానంగా పోటీ చేస్తున్న రెండు పార్టీల మాటలు, చేతలను తీవ్రంగా పరిశీలించి పరిగణలోకి తీసుకుంటున్నాయని చెబుతున్నారు. ఉదాహరణకు... ఏపీలో వైద్య రంగాన్నే పరిగణలోకి తీసుకుంటే... ఆ శాఖలో గతంలో జరిగిన మార్పులు ఏమిటి.. ప్రజలకు చేకూరిన ప్రయోజనాలు ఏమిటి అనే చర్చ బాగా నడుస్తుందని అంటున్నారు!

ఇందులో భాగంగా... "ఆరోగ్యశ్రీ" దగ్గర నుంచి 108, 104 వాహన సేవలతో పాటు ప్రాధానంగా గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, పట్టణానికి ఒక మెడికల్ కాలేజీ వంటి విషయాలు ప్రస్తుతం ప్రభుత్వానికి.. ఆ శాఖ మంత్రికి మంచి పేరు తెచ్చాయని అంటున్నారు. ప్రధానంగా ఆరోగ్య శ్రీ పరిధిని పెంచడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో జగన్ ప్రభుత్వంలోని ఏపీ వైద్య శాఖ, ఆ శాఖ మంత్రి విడదల రజనీ పనితీరుపై ప్రశంసలు అందాయని చెబుతున్నారు!

ఇదే క్రమంలో... గత ప్రభుత్వ హయాంలో పనితీరుని కూడా ప్రజలు మరిచిపోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ+ ప్రభుత్వ హయాంలో... గుంటూరు ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు ఎలుకలు కొరకడంతో మరణించింది! అత్యంత దారుణమైన ఆ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అయితే... నాటి ప్రభుత్వం నుంచి వచ్చిన రియాక్షన్ మరింత వివాదాస్పదమైందనీ అనేవారు!

అయితే... తాజాగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. జగన్ సర్కార్ విద్య, వైద్యం, సంక్షేమంపై ప్రత్యక శ్రద్ధ పెట్టారనే చెప్పాలి! ఈ సమయంలో గుంటూరులోనే కాకుండా... రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వాసుపత్రిలోనూ మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకప్పటిలా... ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఇప్పుడు లేదని నొక్కి చెబుతున్నారు!

దీంతో... ఆ శాఖ మంత్రి విడదల రజనీ పేరు ప్రముఖంగా తెరపైకి వస్తుంది. ఇదే క్రమంలో... ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే క్యాన్సర్ కి కూడా అత్యుత్తమ చికిత్స అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మంత్రి రజనీ చెబుతున్నారు. “నిన్న చేసిన పనే.. రేపు చేయబోయే పని గురించి నేడు చెప్పే మాటపై గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగిస్తుంది” అని అంటారు! అదే విధంగా... 2019 సమయంలో చెప్పిన మాట తప్పలేదు కాబట్టి.. ఇప్పుడు గుంటూరు వెస్ట్ లో అదే పాయింట్ విడదల రజనీకి సానుకూలంగా మారిందని చెబుతున్నారు!