భాషా ఒక్క మాట .... మాజీ సీఎం అయిన జయలలిత
తమిళనాడుని ఒక సామ్రాజ్ఞిలా పాలించించారు జయలలిత. ఆమె మూడు సార్లు సీఎం అయ్యారు.
By: Tupaki Desk | 10 April 2025 9:01 AM ISTతమిళనాడుని ఒక సామ్రాజ్ఞిలా పాలించించారు జయలలిత. ఆమె మూడు సార్లు సీఎం అయ్యారు. ఆమె హయాంలో రాజకీయ ప్రత్యర్థుల విషయంలో దూకుడుగా ఉండేవారు అని చెబుతారు. ఇక ఇది 1990 దశకంలో జరిగిన ముచ్చట. రజనీకాంత్ సూపర్ స్టారిజం పీక్స్ లో ఉన్న వేళ అది.
ఆయన వరస హిట్లతో దూసుకుని పోతున్నారు. ఆయన క్రేజ్ మోజు ఒక లెవెల్ లో ఉంది. తమిళనాడు అంటేనే సినీ రంగం రాజకీయ రంగం పెనవేసుకున్న బంధం. అలా ఒక ఎంజీఆర్ కరుణానిధి జయలలిత సీఎంలు అయ్యారు. ఇక రజనీ కను సైగ చేస్తే చాలు సీఎం కుర్చీ ఆయనదే అన్నంత ప్రజాదరణతో ఉండేవారు.
రజనీ మీద ఆ టైం లో రాజకీయ పుకార్లు ఎన్నో ఉండేవి. ఆయన పార్టీ పెడతారని రాజకీయాల్లోకి వస్తారని చాలా ప్రచారాలు జరిగేవి. ఆయన ఏదో ఒక జాతీయ పార్టీలో చేరుతారని కూడా అనుకునేవారు. ఇక తమిళనాడులో నిర్మాతలు కూడా మంత్రులు అయ్యేవారు. వారంతా రజనీకాంత్ తో సినిమాలు తీసేవారు. అలా వీరప్పన్ అనే నిర్మాత రజనీతో సినిమాలు వరసగా తీస్తూ వచ్చారు. ఆయన తమిళనాడు అప్పటి సీఎం జయలలిత మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఉండేవారు.
ఇక చూస్తే భాషా అని రజనీ కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాను నిర్మించారు. ఆ సినిమా వంద రోజుల వేడుకలో రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాల్లో కుటుంబ వారసత్వం ఎక్కువ అయిందని రాష్ట్రం నాశనం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
రజనీ అలా అన్న వెంటనే వీరప్పన్ ని జయలలిత తన మంత్రివర్గం నుంచి తీసేశారు. దాంతో ఎంతో బాధపడిన రజనీ తాను జయలలితతో మాట్లాడి వీరప్పన్ మంత్రిపదవి దక్కేలా చూస్తాను అని చెప్పారుట. కానీ వీరప్పన్ మాత్రం తన కోసం రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు అని చెప్పి మాజీ మంత్రిగానే ఉండిపోయారుట.
అలా మొదలైన జయలలిత రజనీ డైలాగ్ వార్ ఎక్కడిదాకా వెళ్ళిందంటే 1996లో దేశంలో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. అదే సమయంలో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలూ వచ్చాయి ఈ జోడు ఎన్నికల్లో రజనీకాంత్ ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ బ్రహ్మాస్త్రంగా పనిచేసి జయలలితను సీఎం సీటు నుంచి దించేసింది. ఈసారి కనుక జయలలిత సీఎం అయితే తమిళనాడుని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని రజనీ పవర్ ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు.
దాంతో అది ప్రతిపక్ష డీఎంకేకు ఎంతో రాజకీయ లాభాన్ని చేకూర్చిందింది. ఆ ఎన్నికల్లో డీఎంకే బంపర్ విక్టరీ కొట్టింది. అలాగే ఎంపీ సీట్లు కూడా డీఎంకేతో పాటు ఇతర పార్టీలకు దక్కాయి అలా అన్నాడీఎంకే జయలలిత నాయకత్వంలో ఘోర ఓటమిని చూడాల్సి వచ్చింది.
తన స్నేహితుడు నిర్మాత అయిన వీరప్పన్ కి ఆయన తప్పు లేకపోయినా అకారణంగా జయలలిత మంత్రి పదవి నుంచి తప్పించడం వల్లనే తాను ఎన్నికల్లో అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప తనకూ ఆమెకూ వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రజనీ చెప్పారు. అలా జయలలితతో తన రాజకీయ వైరం అన్న ప్రచారానికి ఇన్నాళ్ళ సీక్రెట్ ని రజనీ రివీల్ చేసి ఫుల్ స్టాప్ పెట్టారు.
