Begin typing your search above and press return to search.

'ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్'... బాబును అంతమాట అన్నారేంటి..?

రాజ్ దీప్ సర్దేశాయ్ తన యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా ఒక వీడియోలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   15 April 2025 10:28 AM IST
ఫ్రెండ్స్  విత్  బెనిఫిట్స్... బాబును అంతమాట అన్నారేంటి..?
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, దేశంలోని సీనియర్ పొలిటీషియన్స్ లో ఒకరైన నారా చంద్రబాబు నాయుడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజనరీ లీడర్ గా పేరు సంపాదించుకున్న ఆయన రాజకీయ వైఖరులపై తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... రాజ్ దీప్ సర్దేశాయ్ తన యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా ఒక వీడియోలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబును అవకాశవాద లౌకికవాదిగా ఆరోపించిన ఆయన.. అందుకు ఉదాహరణగా 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం, 2024లో బీజేపీతో పొత్తు అంశాన్ని ప్రస్థావించారు.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలో మాట్లాడిన రాజ్ దీప్... చంద్రబాబుకు తన రాజకీయ మనుగడ మాత్రమే ప్రధానమని.. తన రాజకీయ ప్రయోజనాలకోసం లౌకికవాదాన్ని వాడుకుంటారని అన్నారు. ఇదే సమయంలో.. చంద్రబాబు లౌకికవాదం బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఒకరకంగా.. లేనప్పుడు మరోరకంగా ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా... 2019 ఎన్నికల నాటి విషయాలను గుర్తు చేసిన ఆయన.. నాడు బీజేపీతో పొత్తు అవసరం లేదని భావించిన చంద్రబాబు.. ఆ పార్టీని మతతత్వపార్టీ అని, అలాంటి బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అదేవిధంగా.. ఆ సమయంలో నరేంద్ర మోడీని ఉగ్రవాది అని కూడా చంద్రబాబు సంభోధించారని ఆయన పేర్కొన్నారు.

అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అదే భారతీయ జనతాపార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని రాజ్ దీప్ అన్నారు. ప్రధానంగా... రాజకీయ పదవులు కాపాడుకోవడానికే లౌకికవాదాన్ని మార్చుకున్న వ్యక్తిగా చంద్రబాబుని అభివర్ణించిన రాజ్ దీప్... వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో బీజేపీకి బలమైన మద్దతుదారుగా చంద్రబాబు నిలబడటాన్ని ఈ సందర్భంగా ఎత్తి చూపారు.

'ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్' అనే థంబ్ నైల్ తో విడుదల చేసిన ఈ వీడియోలో... నితీష్ కుమార్ - మోడీ ల గురించి రాజ్ దీప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తనను తాను అతిపెద్ద లౌకికవాదిగా చెప్పుకున్న నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నారని ప్రస్థావించారు. ఆయనపైనా కీలక వ్యాఖ్యలు చేశారు!