Begin typing your search above and press return to search.

రాజ్యసభలో 41 స్థానాలు ఏకగ్రీవం.. ఎన్నికలు ఎప్పుడంటే?

రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖుల్లో గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ థోలకియా తాజాగా ఎన్నికైన వారిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 5:00 AM GMT
రాజ్యసభలో 41 స్థానాలు ఏకగ్రీవం.. ఎన్నికలు ఎప్పుడంటే?
X

ఖాళీ అయ్యే పెద్దల సభ స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల కావటం తెలిసిందే. మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ 2 తేదీన.. మరో ఆరుగురు ఏప్రిల్ మూడో తేదీన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఎన్నికల్లో మొత్తం 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్నికైన ప్రముఖుల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. బీజేపీ అధ్యక్షుడు జేడీ నడ్డాలతో పాటు 41 మంది అభ్యర్థులు ఉన్నారు. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. గుజరాత్ నుంచి జేపీ నడ్డా ఎన్నికయ్యారు.

ఇటీవల బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం.. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్.. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్.. ఎల్ మురుగన్ తదితరులు ఉన్నారు మొత్తం 41 మంది ఏకగ్రీవాల్లో అత్యధికంగా బీజేపీకి చెందిన వారు ఉన్నారు. వీరు మొత్తం 20 మంది కాగా.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు.. టీఎంసీ నుంచి నలుగురు.. వైసీపీ నుంచి ముగ్గురు.. ఆర్జేడీ నుంచి ఇద్దరు.. బీజేడీ నుంచి ఇద్దరు.. ఎన్సీపీ.. శివసేన.. బీఆర్ఎస్.. జేడీ(యూ)లు ఒక్కో స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మిగిలిన రాజ్యసభ స్థానాలకు మార్చి 27న ఎన్నికలు జరగనున్నాయి.

రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖుల్లో గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ థోలకియా తాజాగా ఎన్నికైన వారిలో ఉన్నారు. ప్రముఖ జర్నలిస్టుగా పేరున్న సాగరిక ఘోష్ టీఎంసీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాతో పాటు.. మరో ఇద్దరు బీజేపీకి చెందిన వారు ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్ నుంచి నలుగురు టీఎంసీ నేతలు.. ఒక బీజేపీకి చెందిన ఎంపీ రాజ్యసభకు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 15 స్థానాలకు పోటీ అనివార్యంగా మారటంతో ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఫలితాలు అదే రోజు వెలువడనున్నాయి.