Begin typing your search above and press return to search.

రాజస్థాన్ ఎమ్మెల్యేలు చాలా రిచ్ గురూ... 157 మంది కోటీశ్వరులే కానీ...!

పార్టీల వారీగా చూస్తే... కాంగ్రెస్‌ పార్టీ నుంచి 88 మంది, బీజేపీ నుంచి 54 మంది, ఇండిపెండెట్లలో 12 మంది కోటీశ్వరులుగా తమ ఆస్తులను ప్రకటించారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:06 AM GMT
రాజస్థాన్  ఎమ్మెల్యేలు చాలా రిచ్  గురూ... 157 మంది కోటీశ్వరులే కానీ...!
X

త్వరలో ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈసీ ప్రకటన రాగానే వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగబోతోన్న ఈ ఐదురాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో రిచ్ పొలిటీషియన్స్ లిస్ట్ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎమ్మెల్యేలలో ఎవరి ఆస్తి ఎంత అనే డేటా వెలుగులోకి వచ్చింది. దీంతో... 157 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని తేలింది.

అవును... త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్‌ రాష్ట్రంలో 157 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు ఉన్నారని.. వీరిలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న మొత్తం 108 ఎమ్మెల్యేల్లో 88 మంది.. ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ఉన్న 69 మంది ఎమ్మెల్యేల్లో 54 మంది, 14 మంది ఇండిపెండెంట్లలో 12 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫాంస్ (ఏడీఆర్‌) వెల్లడించింది.

వీరిలో చోరాసి (ఎస్టీ) నియోజకవర్గ "భారతీయ ట్రైబల్‌ పార్టీ"కి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజ్‌ కుమార్‌ రూ.1.22 లక్షలతో రాష్ట్రంలో అతి తక్కువ ఆస్తిపరుడైన ఎమ్మెల్యేగా ఉండగా... ధోడ్‌ (ఎస్సీ) నియోజకవర్గ సిట్టింగ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పరశురాం మోర్దియా రూ.172 కోట్లతో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచారు.

ఇలా మొత్తం 199 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 157 మంది కోటీశ్వరులు ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే... కాంగ్రెస్‌ పార్టీ నుంచి 88 మంది, బీజేపీ నుంచి 54 మంది, ఇండిపెండెట్లలో 12 మంది కోటీశ్వరులుగా తమ ఆస్తులను ప్రకటించారు. ఈ లెక్కల్లో ఒక్కో సిట్టింగ్‌ ఎమ్మెల్యే యావరేజ్ ఆస్తి రూ.7.49 కోట్లుగా ఉంది. ఈ విషయంలో కూడా పార్టీల వారీగా చూస్తే... కాంగ్రెస్‌ లో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.9.28 కోట్లు కాగా... బీజేపీలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.5.45 కోట్లుగా ఉంది.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 59 (30%) మంది ఎమ్మెల్యేలు తమ విద్యార్హత 5 తరగతి నుంచి 12 తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించారు. ఇక 128 మంది ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్‌ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ఇలా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫాంస్ (ఏడీఆర్‌) విశ్లేషించిన మొత్తం 199 ఎమ్మెల్యేల్లో 27 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే... 14% అన్నమాట!

ఇదే క్రమంలో... ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 46 మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, 28 మంది తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయై తమ తమ అఫిడవిట్లలో ప్రకటించారు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 108 మంది ఎమ్మెల్యేలలో 27 మంది, బీజేపీకి చెందిన 69 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది, సీపీఎంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, 14 మంది ఇండిపెండెంట్ ఎమ్మెలేల్లో ఆరుగురు అఫిడవిట్లలో తమపై క్రిమినల్‌ కేసులను ప్రకటించారు.